‘ప్రతిరోజు పండగే’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ మూవీ రిలీజ్ డేట్ పై తాజాగా అప్డేట్ ను అందించారు మేకర్స్.. మరోవైపు ‘సిరివెన్నెల’ లిరిక్స్ అందించిన టైటిల్ సాంగ్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.
కరోనా తీసుకొచ్చిన పరిస్థితులతో అన్నీ సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. కానీ ఇటీవల పరిస్థితులు చక్కబడటంలో ఒక్కో మూవీ తమ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు. మేకర్స్. తాజాగా హీరో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు మేకర్స్. ‘మే 20’న వరల్డ్ వైడ్ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
దర్శకుడు మారుతీ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం.
ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీని మే 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. అయితే రిలీజ్ డేట్ పోస్టర్ లో 'మే 20న వస్తున్నాం.. కరోనా కరుణిస్తే ' అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మరోవైపు ‘మే’లోనే సూపర్ స్టార్ ‘మహేశ్ బాబు’ నటించిన పక్కా కమర్షియల్ మూవీ కూడా రిలీజ్ కానుంది.
కాగా, తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ‘టైటిల్ సాంగ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన చివరి అక్షరమాలకు మ్యూజిక్ డైరెక్టర్ జకేస్ బీజాయ్ క్యాచీ టూన్ ను అందించారు. దీంతో విడుదలైన కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 50 వేల వ్యూస్ తో య్యూటూబ్ లో దూసుకుపోతోంది.
‘పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్..
దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్..
ఎయిర్ ఫ్రీయా.. నో, నీరు ఫ్రీయా.. నో, ఫైర్ ఫ్రీయా.. నో, నువ్ నుంచున్న జాగా ఫ్రీయా, అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్, జన్మించినా మరణించినా అవదా ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు..’ అంటూ టైటిల్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘పక్కా కమర్షియల్’.
హీరో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహిస్తున్నారు. రావు రమేశ్, సప్తగిరి, తదితరులు పలు పాత్రలు పోషించారు.
