ప్రముఖ పాకిస్తాన్ నటి మెవిష్ హయత్ బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలపై మండిపడింది. సినిమాల్లో తమ దేశాన్ని ప్రతికూలంగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హాలీవుడ్ లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు చేసింది.

అయితే తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందో హయత్ గల్ఫ్ న్యూస్ కి విమరించారు. దుబాయ్ లో జరిగిన ఫిలింఫేర్ ఈవెంట్ లో బాలీవుడ్ గురించి మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్ లో ముస్లింలను చెడుగా చూపిస్తున్న తీరు ఇస్లాంఫోబియాకు దారి తీస్తోన్న వైనాన్ని ఎత్తిచూపుతూ సంచలన కామెంట్స్ చేశారు.

మరోవైపు అంతర్జాతీయ వేదికపై పాక్ నటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అనే చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం భారత్-పాక్ ల మధ్య సంబంధాలు సవ్యంగా లేవు. ఇలాంటి సమయంలో పాక్ నటి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి.

పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీలో మెవిష్ కి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకి తమ్ఘ-ఈ-ఇంతియాజ్అనే అవార్డుతో గౌరవించింది. మెవిష్ చివరిగా 'చాల్వా' అనే సినిమాలో  కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'బాజీ' అనే సినిమాలో నటిస్తోంది.సాకిబ్ మాలిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.