పాకిస్తాన్ ఆలోచన విధానం కొన్నిసార్లు ఎంత దారుణంగా ఉంటుందో మరోసారి ప్రపంచానికి క్లియర్ గా అర్ధమయ్యింది. విషమిచ్చి పెంచుతున్న ఉగ్రపాముకు ప్రతిసారి ఎక్కువగా బలయ్యేది పాకిస్తాన్ అని అందరికి తెలిసిన విషయమే. ఇకపోతే పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ లో పాక్ సినీ వరల్డ్ ఏ మాత్రం టచ్ చేయకూడదని ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. 

అయితే పాక్ కూడా పంతానికి పోయి భారత్ సినిమాను నిషేదిస్తున్నట్లు చెప్పి అందువల్ల తమకు ఎలాంటి నష్టం లేదని వివరణ ఇచ్చింది. కానీ ఇప్పుడు కోపానికి పోయి గొయ్యి తవ్వుకున్నట్లు పాకిస్తాన్ సినీ వరల్డ్ దారుణంగా నష్టాలను మూటగట్టుకుంది. బాలీవుడ్ కి అక్కడ సినిమాలు ఆడకపోవడం వాళ్ళ పెద్దగా నష్టమేమి లేదు.

ఎందుకంటే పాక్ లో గట్టిగా 130 థియేటర్స్ కూడా లేవు. అందువల్ల అక్కడ ఇండియన్ సినిమాలు ఆడకుంటే పాక్ ఇండస్ట్రీకె నష్టం. ఏడాదికి 100 సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అవ్వవు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. ఇక భారత్ లో 6 వేలకు పైగా సింగిల్ థియేటర్స్ 2 వేలకు పైగా మల్టిప్లెక్స్ లు ఉన్నాయి. 

అక్కడ సినిమా వాళ్లకు వచ్చే ఆదాయం ఇండియా నుంచే. కానీ ఇప్పుడు విధించిన నిషేధంతో పాక్ ఇండస్ట్రీ బారి నష్టాలతో విలవిలలాడుతోంది. గతంలో ఇదే తరహాలో నిషేధం విధించి మళ్ళి బాలీవుడ్ సినిమాలకు పాక్ అనుమతి ఇచ్చింది.  అక్కడ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సల్మాన్ సుల్తాన్ నిలిచింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్లను కొల్లగొట్టిన సుల్తాన్ పాకిస్తాన్ లో 37 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.