Asianet News TeluguAsianet News Telugu

ఓటీటిల నుంచి అలాంటి రిప్లై .. నాగ్ ఎక్సపెక్ట్ చేయలేదట!

`వైల్డ్ డాగ్` ని తీసుకోవటానికి ఓటీటి సంస్దలు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే వార్త పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమాని మొదట థియోటర్ రిలీజ్ కే అనుకున్నారు. అయితే నాని వంటి యంగ్ హీరో క్రేజీ సినిమా వి కే ఓటీటి రిలీజ్ తప్పనప్పుడు మన సినిమాలు ఆపుకోవటం ఎందుకనే ఆలోచన అందరిలో కలుగుతోంది. అదే పద్దతిలో నాగార్జున సైతం తమ సినిమా `వైల్డ్ డాగ్` ని ఓటీటికి ఇచ్చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసారట. అయితే ఈ సినిమాకు చెప్పే రేటు ఓటీటి వారు ఇవ్వటానికి ఉత్సాహం చూపటం లేదట. 

OTT Platforms Not Interested in Nagarjuna wild dog
Author
Hyderabad, First Published Aug 25, 2020, 1:13 PM IST

నాగార్జున కు క్రేజ్ తగ్గిందా..లేక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగ ఉండదనే ప్రచారం కొంపముంచిందా...ఇప్పుడు నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్` ని తీసుకోవటానికి ఓటీటి సంస్దలు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే వార్త పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమాని మొదట థియోటర్ రిలీజ్ కే అనుకున్నారు. అయితే నాని వంటి యంగ్ హీరో క్రేజీ సినిమా వి కే ఓటీటి రిలీజ్ తప్పనప్పుడు మన సినిమాలు ఆపుకోవటం ఎందుకనే ఆలోచన అందరిలో కలుగుతోంది. అదే పద్దతిలో నాగార్జున సైతం తమ సినిమా `వైల్డ్ డాగ్` ని ఓటీటికి ఇచ్చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసారట. అయితే ఈ సినిమాకు చెప్పే రేటు ఓటీటి వారు ఇవ్వటానికి ఉత్సాహం చూపటం లేదట. 

పెద్ద పెద్ద ఎమౌంట్స్ ఇచ్చి తీసుకోలేమని చెప్పేసారట. నాగార్జున ఫామ్ లో లేకపోవటం, కొత్త డైరక్టర్ కావటం కారణాలుగా చూపెడుతున్నారట. మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ అవటం కూడా ఓ కారణం అంటున్నారు. 2016లో వచ్చన ఊపిరి తర్వాత నాగార్జునకు సరైన హిట్ పడలేదు. దాంతో తాము అంతంత రేటు పెట్టి కొనలేమని ఓటీటి సంస్దలు తేల్చి చెప్పేసాయట. ఈ నేపధ్యంలో వారు ఇచ్చిన రేటు పుచ్చుకుని సినిమా రిలీజ్ చేయాలా లేక థియోటర్ దాకా వెయిట్ చేయటం బెస్టా అనే డైలమోలో నిర్మాతలు పడ్డారట.  

ఇక పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న ‘వైల్డ్ డాగ్’ పై నాగార్జున అభిమానులకు మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కరోనా వల్ల వెనక బడటంతో కాస్తంత నిరాశకు లోనైన మాట వాస్తవం.  ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఒక్కసారి నాగార్జున ...బిగ్ బాస్ షో షూట్ పూర్తవగానే వైల్డ్ డాగ్ పనిలో పడతారని తెలుస్తోంది. యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. 
 
కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 
 
26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. కేవలం రీరికార్డింగ్ కోసమే సంగీత దర్శకుడుని తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రత్యేకమైన కామెడీ కానీ, హీరోయిన్ కానీ ఉండదు. ఓ హాలీవుడ్ చిత్రంలాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో హీరోయిన్ ని ప్రకటించలేదు. అలాగే పాటలు ఉండవు కాబట్టి రీరికార్డింగ్ బాగా ఇచ్చే వారిని సంగీత దర్శకుడుగా తీసుకోబోతోన్నట్లు సమాచారం.

 `గగనం` తర్వాత నాగార్జున ఇలాంటి ప్రయోగం తరహా పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ , తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios