Asianet News TeluguAsianet News Telugu

Oscars 2024 : ఆస్కార్ అవార్డ్స్.. నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఈవెంట్ వివరాలు!

ప్రపంచ వ్యాప్తంగా సినీలోకం ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన అవార్డుల పండుగ ఆస్కార్స్ ఈవెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా కెటగిరీల వారీగా నామిషన్స్ ఫుల్ లిస్ట్ విడుదలైంది.
 

Oscars 2024 Awards Nominations full List and Event Details NSK
Author
First Published Mar 10, 2024, 10:44 PM IST

సినీలోకం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు ఆస్కార్ అవార్డ్స్ (Oscar Award). అకాడెమీ అవార్డులను ప్రతి యేటా యూఎస్ లో గ్రాండ్ ఈవెంట్ మధ్య ప్రదానం చేస్తున్న విషం తెలిసిందే. గతేడాది ఓరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ నాటునాటు సాంగ్ కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆస్కార్స్ 2024 కు సంబంధించిన వివరాలు అందాయి. ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. 96వ అకాడమీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ను లిస్టు విడుదలైంది.కేటగిరీల వారీగా నామినీల వివరాలు ఉన్నాయి.
  
బెస్ట్ పిక్చర్ కెటగిరీలో..
ఈ విభాగంలో 10 మంది నామినీలు ఉన్నారు. అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో, ఓపెన్‌హైమర్, పాస్ట్ లివ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంటెరెస్ట్

యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్..
ఈ విభాగంలో బ్రాడ్లీ కూపర్, కోల్మన్ డొమింగో, పాల్ గియామట్టి, సిలియన్ మర్ఫీ, జెఫ్రీ రైట్ వంటి నామినీలుగా ఉన్నారు.

ప్రధాన పాత్రలో నటి..
ఈ విభాగంలో అన్నెట్ బెనింగ్, లిల్లీ గ్లాడ్‌స్టోన్, సాండ్రా హల్లెర్, కారీ ముల్లిగాన్ మరియు ఎమ్మా స్టోన్ ఉన్నారు.

సహాయక పాత్రలో నటుడిగా
స్టెర్లింగ్ కె బ్రౌన్, రాబర్ట్ డి నీరో, రాబర్ట్ డౌనీ జూనియర్, ర్యాన్ గోస్లింగ్, మార్క్ రుఫెలో ఉన్నారు. 

సహాయక పాత్రలో నటిగా
ఎమిలీ బ్లంట్, డేనియల్ బ్రూక్స్, అమెరికా ఫెర్రెరా, జోడీ ఫోస్టర్, డావిన్ జాయ్ రాండోల్ఫ్ ఉన్నారు.

దర్శకత్వం
జస్టిన్ ట్రియెట్, మార్టిన్ స్కోర్సెస్, క్రిస్టోఫర్ నోలన్, యోర్గోస్ లాంటిమోస్, జోనాథన్ గ్లేజర్ ఉన్నారు. 

రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే)
అమెరికన్ ఫిక్షన్, బార్బీ, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిత్రాలు ఉన్నాయి.
 
రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, ది హోల్డోవర్స్, మాస్ట్రో, మే డిసెంబర్, పాస్ట్ లైవ్స్ సినిమాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్
ఈ కేటగిరిలో.. ఐయో క్యాపిటానో, పర్ఫెక్ట్ డేస్, సొసైటీ ఆఫ్ ది స్నో, ది టీచర్స్ లాంజ్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సినిమాలు ఉన్నాయి.

యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్
ఈ కేటగిరిలో.. ది బాయ్ అండ్ ది హెరాన్, ఎలిమెంటల్, నిమోనా, రోబోట్ డ్రీమ్స్, స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ చిత్రాలు కలవు.

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్
ఈ విభాగంలో...  బోబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, టు కిల్ ఎ టైగర్, 20 డేస్ ఇన్ మారియుపోల్ చిత్రాలున్నాయి. 

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్
విభాగంలో.. ది యాక్టర్, ఇన్విన్సిబుల్, నైట్ ఆఫ్ ఫార్చ్యూన్, రెడ్, వైట్ అండ్ బ్లూ, ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్.

డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్
ది ఏబీసీస్ ఆఫ్ బుక్ బ్యానింగ్, ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్, ది ఐలాండ్ ఇన్ బిట్వీన్, ది లాస్ట్ రిపేర్ షాప్, నై నై మరియు వాయ్ పో ఉన్నాయి.
 
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్
లెటర్ టు ఎ పిగ్, నైంటీ-ఫైవ్ సెన్సెస్, అవర్ యూనిఫాం, పాచిడెర్మ్, వార్ ఈజ్ ఓవర్! చిత్రాలు పోటీ పడుతున్నాయి. 

ఫిల్మ్ ఎడిటింగ్
అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్ సినిమాలు కలవు.
 
ప్రొడక్షన్ డిజైన్ 
బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్ మూవీలున్నాయి.

కాస్ట్యూమ్ డిజైన్
బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఒపెన్‌హైమర్, పూర్ థింగ్స్ 

సంగీతం (ఒరిజినల్ స్కోర్)
అమెరికన్ ఫిక్షన్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఒపెన్‌హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలున్నాయి. 
 
సంగీతం (ఒరిజినల్ సాంగ్)
ద ఫైర్ ఇన్‌సైడ్, ఐయామ్ జస్ట్ కెన్, ఇట్ నెవర్ వెంట్ అవే, వహ్జాజే, వాట్ వాజ్ ఐ మేడ్? పాటలు పోటీలో ఉన్నాయి. 

మేకప్, హెయిర్ స్టైలింగ్
గోల్డా, మాస్ట్రో, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్, సొసైటీ ఆఫ్ ది స్నో టీమ్ ఉంది. 

సౌండ్
ది క్రియేటర్, మాస్ట్రో, మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ వన్, ఓపెన్‌హైమర్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాలు పోటీలో ఉన్నాయి. 

విజువల్ ఎఫెక్ట్స్
ది క్రియేటర్, గాడ్జిల్లా మైనస్ వన్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం 3, మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్, నెపోలియన్ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఇలా మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రధానం చేయబోతున్నారు.  ఆస్కార్ 2024 వేడుక మార్చి 10న సాయంత్రం 7 గంటలకు  ప్రారంభమవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios