ఈ ఆస్కార్ లిస్ట్ లో  ఈ సారి కూడా భారతీయ చిత్రాలకు నిరాశే ఎదురైంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా విదేశీ చిత్రం కేటగిరిలో పోటీ పడిన సంగతి తెలిసిందే. కానీ, తుది జాబితాలో మాత్రం ఈ చిత్రం చోటు దక్కించుకోలేకపోయింది.అ

ఆస్కార్‌ అవార్డు.. జీవితంలో ఒక్కసారైనా దీన్ని గెలుచుకోవాలని ఉవ్విళ్లూరే సినీ స్టార్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అకాడమీ అవార్డు సాధిస్తే ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరపడిపోయే పరిస్దితి. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక 94వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 27న లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది. ఈ క్రమంలో ఆస్కార్ నామినేషన్స్ ని ప్రకటించింది కమిటి. ఈ నామినేషన్ల వివరాలను నటి ట్రేసీ ఎల్లిస్ రాస్, కమెడియన్ లెస్లీ జోర్డాన్ మీడియాకు వెల్లడించారు.

అయితే ఈ ఆస్కార్ లిస్ట్ లో ఈ సారి కూడా భారతీయ చిత్రాలకు నిరాశే ఎదురైంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా విదేశీ చిత్రం కేటగిరిలో పోటీ పడిన సంగతి తెలిసిందే. కానీ, తుది జాబితాలో మాత్రం ఈ చిత్రం చోటు దక్కించుకోలేకపోయింది.అయితే, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారత్ నుంచి ‘రైటింగ్ విత్ ఫైర్’ మాత్రం నామినేట్ అయింది.

ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాలు, నటుల వివరాల ఫైనల్ లిస్ట్‌

ఉత్తమ చిత్రం BEST PICTURE

ద పవర్ ఆఫ్ ద డాగ్
బెల్ ఫాస్ట్
కోడా
డోంట్ లుక్ అప్
డూన్
నైట్ మేర్ అల్లీ
వెస్ట్ సైడ్ స్టోరీ
లికోరైస్ పిజ్జా
డ్రైవ్ మై కార్
కింగ్ రిచర్డ్

ఉత్తమ నటుడు BEST ACTOR

బెనెడిక్ట్ కంబర్ బాచ్ (ద పవర్ ఆఫ్ ద డాగ్)
డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మాక్ బెత్)
జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ద రికార్డోస్)
విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ఆండ్రూ గార్ ఫీల్డ్ (టిక్, టిక్... బూమ్)

ఉత్తమ దర్శకుడు BEST DIRECTOR

జేన్ కాంపియన్ (ద పవర్ ఆఫ్ ద డాగ్)
పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా)
స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
ర్యుసుకే హమగుచి (డ్రైవ్ మై కార్)
కెన్నెత్ బ్రనా (బెల్ ఫాస్ట్)

ఉత్తమ నటి BEST ACTRESS

పెనెలోప్ క్రజ్ (పారలల్ మదర్స్)
క్రిస్టెన్ స్టీవార్ట్ (స్పెన్సర్)
జెస్సికా చాస్టెయిన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే)
నికోల్ కిడ్ మాన్ (బీయింగ్ ద రికార్డోస్)
ఒలీవియా కోల్మన్ (ద లాస్ట్ డాటర్)

ఎడిటింగ్

* డోంట్ లుక్ అప్ (హ్యాంక్ కార్విన్)
* డ్యూనీ (జోయ్ వాకర్)
* కింగ్ రిచర్డ్ (పమేలా మార్టిన్)
* ది పవర్ ఆఫ్ ది డాగ్ (పీటర్ స్క్రిబిస్)
* టిక్ టిక్.. భూమ్ (మైరాన్ కిరీస్టిన్..ఆండ్రూ)

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్

* డ్రైవ్ మై కార్ (జపాన్ )
* ఫ్లీ (డెన్మార్క్)
* ది హ్యాండ్ ఆఫ్ గాడ్ (ఇటలీ)
* లూనానా: ఏ యాక్ ఇన్ ది క్లాస్ రూమ్ (భూటాన్)
* ది వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్( నార్వే)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

* సియాన్ హెడర్ (కొడా)
* ర్యూసుకీ హమగూచి, తకమస ( డ్రైవ్ మై కార్)
* జాన్ స్పైట్స్, డెనీస్ విల్లెన్యూ, ఎరిక్ రోత్ (డ్యూన్)
* మ్యాగీ గిల్లెన్హాల్ (ది లాస్ట్ డాటర్)
* జాన్ క్యాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్

* బీ అలైవ్ (కింగ్ రిచార్డ్)
* డౌన్ టు జాయ్ (బెల్ ఫాస్ట్)
* నో టైమ్ టు డై (నో టైమ్ టు డై)
* సమ్ హౌ యు డు (ఫోర్ గుడ్ డేస్)
* ఒరుగితాస్ (ఎన్‌కాంటో)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
* కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్)
* ఆడమ్ (డోన్ట్ లుక్ అప్)
* బేలిన్ (కింగ్ రిచర్డ్)
* పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజా)
* ఎస్కిల్, జోచిమ్ ట్రైయర్ ( ది వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

* జెన్నీ బేవన్ ( క్రుయెల్లా)
* మ్యాసిమో కాంటనీ, జాక్వెలిన్ డుర్రా (సిరానో)
* జాక్వెలిన్ వెస్ట్, రాబర్ట్ మార్గన్ (డ్యూన్)
* లూయిస్ సెక్విరియా (నైట్‌మేర్ అల్లీ)
* పాల్ తాజ్వెల్ (వెస్ట్ సైడ్ స్టోరీ)

ఉత్తమ ఒరిజినల్ స్కోర్

 * నికోలస్ బ్రిటెల్ (లోన్ట్ లుకప్)
* హ్యాన్స్ జిమ్మర్ (డ్యూన్)
* జర్మైన్ ఫ్రాంకో (ఎన్‌కాంటో)
* అల్ బెర్టో (పార్లల్ మదర్స్)
* జానీ గ్రీన్‌వుడ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)

Oscars.org అనే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్ పేజీల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆస్కార్ 2022 నామినేషన్స్ షో ప్రతక్ష్య ప్రసారం చేసారు.