RC15 సెట్స్ లో గ్రాండ్ స్టైల్ లో ఆస్కార్ సెలెబ్రేషన్స్, రియల్ హీరోకి సన్మానం.. దుమ్ములేపిన ప్రభుదేవా
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ ఇండియాలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ ఇండియాలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. నేరుగా ఢిల్లీకి వచ్చిన చరణ్ అక్కడ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నాడు.
అనంతరం చరణ్ హైదరాబాద్ కి చేరుకోగా ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. రాగానే రాంచరణ్ RC15 సెట్స్ కి వెళ్ళాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్న పాటకి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ షూటింగ్ కి రావడంతో.. సెట్స్ లోనే చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ప్రభుదేవా వందలాది మంది కో డ్యాన్సర్లతో కలసి నాటు నాటు పాటకి స్టెప్పులేస్తూ దుమ్ముదులిపారు. సెట్ మొత్తం హోరెత్తే విధంగా వీరి డ్యాన్స్ సాగింది. అనంతరం ప్రభుదేవా, రాంచరణ్.. నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని సన్మానించారు. కేక్ కటింగ్ కూడా జరిగింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రం ఇదే. పైగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ నెల 27న రాంచరణ్ బర్త్ డే ఉంది. చరణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.