లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత వైభవంగా 94వ అకాడమీ అవార్డ్స్ వేడుక ముగిసింది. ప్రపంచ ప్రఖ్యాత సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో అవార్డ్స్ విన్నర్స్ తో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. అయితే ఈ ఆస్కార్ వేడుకలపై, ఆస్కార్ కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు.ఎందుకంటే..?
లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత వైభవంగా 94వ అకాడమీ అవార్డ్స్ వేడుక ముగిసింది. ప్రపంచ ప్రఖ్యాత సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో అవార్డ్స్ విన్నర్స్ తో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. అయితే ఈ ఆస్కార్ వేడుకలపై, ఆస్కార్ కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు.ఎందుకంటే..?
ఆస్కార్ అవార్డ్స్ కమిటీపై ఇండియన్స్ కోపంతో ఉన్నారు. ఇండియన్స్ ను అవమానించారంటూ మండిపడుతున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు.చిన్నచిన్న వివాదాలు మినహా... ఈ ఈవెంట్ అంతా అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఇండియన్ లెజెండ్స్ ను వాళ్లు మర్చిపోవడమే. ఆస్కార్ అవార్డ్స్ ఇన్ మెమోరియమ్ విభాగంలో.. దివంగత ప్రపంచ సినీ ప్రముఖలకు నివాళి అర్పిస్తారు. ఈ సారి ఈ విభాగంలో ఇండియా నుంచి గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడం ఆడియన్స్ కు కోపం తెప్పించింది.
గతంలో 93వ ఆస్కార్ అవార్డ్స్ సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లకు ఆస్కార్ ఇన్ మెమోరియమ్ ఘనంగా నివాళి అర్పించింది. కాని ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌లను ఇందులో విస్మరించడంతో ఇండియన్ ఫ్యాస్స్ ఫుల్ పైర్ అవుతున్నారు. ఆస్కార్ కమిటీ మెమరీ లో వీళ్లిద్దరూ లేరా అని చర్చించుకుంటున్నారు.
గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలుస్తాయి. ఇన్ మెమోరియమ్ ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే..లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్‌ని కూడా ఆస్కార్ కమిటీ మర్చిపోయింది. దాంతో ఆస్కార్ చేసింది ముమ్మాటికీ తప్పే అంటున్నారు నెటిజన్లు.
