మనోజ్ మరో ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సదరు వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల హీరో మంచు మనోజ్ భారీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా పోస్ట్స్ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎప్పుడు ఏ బాంబు పేల్చుతారో అన్న ఆలోచనలో ఉంటున్నారు. మనోజ్ తన అన్నయ్య విష్ణు మీద ఆరోపణలు చేస్తూ ఓ వీడియో ఫేస్ బుక్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు. మా వాళ్ళ మీద విష్ణు ఇలానే దాడి చేస్తున్నాడని మనోజ్ అన్నారు. దీంతో మొన్నటి వరకు పుకార్లుగా ఉన్న మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు నిజమేనని కథనాలు వెలువడ్డాయి. అయితే అది ఓ రియాలిటీ షో కోసం చేసిన ఫ్రాంక్ వీడియో అని విష్ణు కవర్ చేయాలని చూశారు. కానీ అనుమానాలు అలానే ఉన్నాయి.
కాగా నేడు మనోజ్ మరో వీడియో షేర్ చేశారు. అయితే ఇది వివాదాల వీడియో కాదు. ఓ రొమాంటిక్ వీడియో. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకుని నేటికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ భార్య మౌనికతో కూడిన ఓ లవ్లీ వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. 'ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు' అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. మనోజ్ లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది.

మార్చ్ 3న మనోజ్-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. మనోజ్ పెళ్లికి పెద్ద మంచు లక్ష్మినే. మోహన్ బాబు, విష్ణు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. మనోజ్ ఇష్టాన్ని గౌరవించి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నా చిన్న తమ్ముడికి అండగా నిలిచింది. తన నివాసంలో మూడు రోజులు మనోజ్ వివాహం ఘనంగా చేశారు. మోహన్ బాబు పెద్దరికం నిలుపుకోవడం కోసం చివరి నిమిషంలో పెళ్లి మండపానికి వచ్చారు. విష్ణు అయితే వచ్చారో రాలేదో కూడా తెలియదు.
దీన్ని బట్టి విష్ణు-మనోజ్ లలో మంచు లక్ష్మి చిన్న తమ్ముడు పక్షమే అని తేలిపోయింది. ఆసక్తికర విషయం ఏమిటంటే లక్ష్మితో కూడా విష్ణుకు చెడిందని టాలీవుడ్ టాక్. వీరిద్దరి మధ్య కూడా దూరం పెరిగిందట. మోహన్ బాబు పిల్లలు విష్ణు ఒకవైపు మనోజ్, లక్ష్మి మరొక వైపు చేరారట. మోహన్ బాబు కుటుంబం రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణాలు ఏంటనేది తెలియదు. మరొక విశేషం ఏంటంటే... కొత్త జంట మనోజ్-మౌనిక ఎక్కడికెళ్లినా పక్కనే మంచు లక్ష్మి ఉంటున్నారు. మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో ఈ ముగ్గురు కలిసి పాల్గొన్నారు. అలాగే రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి కూడా మనోజ్, లక్ష్మి, మౌనిక హాజరయ్యారు.
