ఎన్ని జాగ్రత్తలు తీసుకునున్నా వకీల్ సాబ్ లీకుల పర్వం ఆగడం లేదు.తరుచుగా ఈ మూవీ నుండి వర్కింగ్ స్టిల్స్ బయటికి వస్తున్నాయి. తాజాగా వకీల్ సాబ్ సెట్స్ నుండి మరొక ఫోటో లీకైంది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి ఉన్న ఫొటోలో నీలి రంగు చుడిదార్ లో శృతి లుక్ ఆసక్తి రేపుతోంది. ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా వీద్దరూ ఆ గెటప్స్ లో దర్శనం ఇచ్చారని సమాచారం. వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా నిడివి ఉండదు. ఈ మూవీలో ఆమె పాత్ర చనిపోతుందని సమాచారం. చనిపోయిన భార్య కోసం డిప్రెషన్ లోకి వెళ్లిన తాగుబోతు వ్యక్తిగా పవన్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. 

 
హిందీ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. గత ఏడాది మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొనివుంది. ఇక నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 
కాగా పవన్ నిన్న మరొక నూతన ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ లో అయన నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ మూవీలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిచడం మరో విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు. ఇప్పటికే పవన్ క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో చిత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.