పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి నటించేందుకు మరో అవకాశం కల్పించారు `సలార్‌` చిత్ర బృందం. ఇందులో చాలా వరకు కొత్త నటీనటులను తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఆడిషన్‌ని నవంబర్‌ నుంచి ప్రారంభించారు. దీనికి ఇప్పటికే వందలాది మంది నటనపై ఆసక్తిగల వారు తమ ప్రతిభని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మరో అవకాశం కల్పిస్తుంది `సలార్‌` చిత్ర బృందం. 

ఇంతకు ముందు డైరెక్ట్ ఆడిషన్‌ చేసిన యూనిట్‌ ఇప్పుడు ఒక నిమిషం నిడివి గల వీడియోలను పంపించాలని తెలిపింది. భాష ఏదైనా నిమిషం వీడియోని ఈ నెల 30 ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పంపించాలని వెల్లడించారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సెలబ్రిటీల రీట్వీట్లతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఏజ్‌ లిమిట్‌ లేదు. చిన్నారుల ఎనిమిది నుంచి 12ఏళ్ల వయసు ఉండాలి. మిగిలిన వారికి ఏజ్‌ లిమిట్‌ లేదు. 

`సలార్‌` చిత్రాన్ని ప్రభాస్‌ హీరోగా రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. హోంబలే ఫిల్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందే ఈ సినిమాని జనవరి 18న ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.