సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సమంత మాట్లాడుతూ.. ఒకప్పుడు నా జీవితం చాలా సింపుల్ అండ్ హ్యాపీ. అనుకోకుండా కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇబ్బందుల నుండి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ గా తయారవుతారు. నేను కూడా అలానే ధృడంగా మారాను. నేనేమీ ప్రత్యేకం కాదు. నాకు ఎదురైన సవాళ్లు కొంచెం భిన్నమైనవి. అవి నా జీవితం నాశనం చేయకుండా ఉండేందుకు నన్ను నేను మార్చుకున్నాను... అని అన్నారు.
ది ఫ్యామిలీ మాన్ 2 లో రాజీ వంటి పాత్ర తర్వాత శకుంతల పాత్ర చేయడానికి భయం వేసింది. శకుంతల అందమైన అమ్మాయి మాత్రమే కాదు. ఆత్మగౌరవం కలిగిన ధృడమైన పాత్ర అది. ఏ తరం అమ్మాయికైనా శకుంతల పాత్ర కనెక్ట్ అవుతుంది. శాకుంతలం కథ విన్నాక నేను ఆశ్చర్యపోయాను. భారతీయ సాహిత్యంలో గొప్ప పాత్రల్లో ఒకటైన శకుంతలగా నటించాడాన్ని బాధ్యతగా భావించానని సమంత అన్నారు. శాకుంతలం 3డీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని గుణశేఖర్ సృష్టించారని ఆమె కొనియాడారు.
గత రెండేళ్లుగా సమంత జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. భర్త నాగ చైతన్యతో విడాకులు అయ్యాయి. ఆ ఘటన ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేసింది. డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత స్నేహితులతో విహారాలకు వెళ్లారు. విడాకుల వేదన నుండి బయటపడిన నెలల వ్యవధిలో ఆమెను మరో సమస్య వెంటాడింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సమంతకు సోకింది. ఈ విషయాల గురించి సమంత పరోక్షంగా చెప్పారు.
శాకుంతలం చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ శకుంతల విడుదల కానుంది. సమంతకు జంటగా మోహన్ దేవ్ నటించారు. విలక్షణ నటుడు మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్ర చేశారు. మణిశర్మ సంగీతం అందించారు. అలాగే సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూట్స్ లో పాల్గొంటున్నారు.
