కింగ్ నాగార్జున వరుస చిత్రాలతో వేగం పెంచుతున్నాడు. నాగ్ ప్రస్తుతం నటిస్తున్న మన్మథుడు 2 చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజులో నాగార్జున నటించాల్సి ఉంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. నాగ చైతన్య కూడా ఈ చిత్రం నటించబోతున్నాడు. 

తండ్రి కొడుకులకు హీరోయిన్లని సెట్ చేయడం కళ్యాణ్ కృష్ణకు పెద్ద సమస్యలా మారినట్లు ఉంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో రోజుకొక వార్త బయటకు వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన పూజా హెగ్డే ని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ ప్రయత్నం బెడిసికొట్టిందో ఏమో కానీ మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. 

తొలి చిత్రంలో తనకు లైఫ్ ఇచ్చిన అనుష్క మరోసారి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగార్రాజులో అనుష్క హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సూపర్, రగడ, డాన్, డమరుకం చిత్రాల్లో నాగార్జున, అనుష్క జంటగా నటించారు. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో అనుష్క గెస్ట్ రోల్ లో నటించింది.