Asianet News TeluguAsianet News Telugu

Sridevi Birth Anniversary: ప్రతిరోజూ గుర్తొస్తున్నావమ్మా... జాన్వీ ఎమోషనల్ పోస్ట్!


తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకున్నారు కూతురు జాన్వీ. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫోటో షేర్ చేసిన జాన్వీ... ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. 

on sridevi birth anniversary janhvi kapoor shares an emotional note
Author
First Published Aug 13, 2022, 12:52 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెకు స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా ప్రియమైన అమ్మను గుర్తు చేసుకుంది. బాల్యంలో తాను అమ్మతో దిగిన ఫోటో షేర్ చేసిన జాన్వీ... ప్రతి రోజు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్ డే మమ్మీ... అంటూ కామెంట్ పెట్టారు. 

స్టార్ హీరోయిన్ గా భారత చలన చిత్ర పరిశ్రమను ఏలిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్ లో మరణించారు. అప్పటికి శ్రీదేవి వయసు కేవలం 54 ఏళ్ళు మాత్రమే. జాన్వీని తనకు మాదిరి పెద్ద స్టార్ ని చేయాలని శ్రీదేవి కలలు కన్నారు. జాన్వీ డెబ్యూ మూవీ దఢక్ విడుదలకు ముందే శ్రీదేవి కన్నుమూశారు.జాన్వీని కనీసం వెండితెరపై చూసుకునే అవకాశం కూడా శ్రీదేవికి దక్కలేదు. 

అందంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటున్న జాన్వీ(Janhvi Kapoor)... బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. జాన్వీ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైంది. ప్రస్తుతం ఆమె మిల్లీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక సౌత్ చిత్రాల్లో నటించడం జాన్వీకి ఇష్టం లేదు. ఆమెకు తల పొగరు అంటూ... కథనాలు వెలువడగా జాన్వీ స్పందించారు. ఈ పుకార్లను తనదైన శైలిలో ఖండించారు. జాన్వీ తండ్రి బోనీకపూర్ నిర్మాతగా తమిళ, తెలుగు భాషల్లో చిత్రాలు నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios