Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన నాని, కొత్త సినిమా ప్రకటించిన నేచురల్ స్టార్

గెలుపోటములతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఒక హిట్టు... ఒక ప్లాప్ అన్నట్టు సాగిపోతుంది నానీ మూవీ కెరీర్. దాంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు యంగ్ హీరో. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. 
 

On New Year Occasion Nani 30 Movie Update
Author
First Published Jan 1, 2023, 6:23 PM IST

వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో..  ఈ ఏడాది నాని నటించిన అంటే సుందరానికీ  బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.. దాంతో జాగ్రత్త పడ్డ నాని.. జానర్ ను మార్చాడు..ప్రయోగాలు మాత్రం ఆపలేదు. ఈసారి క్లాస్ కాకుండా మాస్ ను ట్రై చేస్తున్నాడు. దసరా సినిమాతో ఊరమాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు నాని. మాస్ లుక్ లోకి మేకోవర్ అయ్యాడు కాని..మాస్ లుక్ ఒకే.. మాస్ పెర్ఫామెన్స్ ఉంటుందా లేదాఅనేదిచూడాలి. ఇక ఇది ఇలా ఉంటే.. సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాని. తన నెక్ట్స్ మూవీని కూడా లైన్ లో పెట్టేసి అప్ డేట్ ఇచ్చేశాడు. నెక్ట్స్ సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. 

 ఇవాళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాని 30 వ చిత్రాన్ని ప్రకటించాడు నేచురల్ స్టార్ నాని. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఫస్ట్  గ్లింప్స్‌ వీడియో షేర్ చేశాడు నాని. దసరా సినిమా గెటప్‌లో ఉన్న నానిని చూసి డాడీ నీ గడ్డం నచ్చలేదంటోంది అతడి కూతురు.ఇది దసరా కోసం నాన్న అయిపోవచ్చింది. మన సినిమా అని నాని ఆ చిన్నారికి  చెబుతున్నాడు.. మరి మీసం.. అంటే ఉండదు.. జుట్టు అని అడుగుతూనే.. ఉంచుదాం లే నాన్నా..అంటుండగా నువ్వుంచుదామంటే ఉంచుదామని అంటున్నాడు నాని. తండ్రీకూతుళ్ల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లియర్ అవుతోంది. 

 

ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటీ అంటే.. నాని జతగా.. ఈ సినిమాలో  సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.అంతేకాకుండా ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి  పరిచయం చేయబోతున్నాడు నాని. శౌర్యువ్‌ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీని రూపొందిస్తున్నారు.  ఈ మధ్య కొత్త దర్శకుల కథలను బాగా వింటున్నాడు నాని. కోత్తవారితో ప్రయోగాలు చేస్తూ.. వారికి ఇండస్ట్రీలో లైఫ్ ఇస్తున్నాడు. క ఇప్పటికే నాని 5గురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

 

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న దసరా మూవీ షూటింగ్ మాత్రం పరుగులు పెడుతోంది. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ  లో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఫస్ట్ టైమ్ ఈరేంజ్ లో..  నాని ఫుల్‌ లెంగ్త్‌ ఊరమాస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. దాంతో అటు నేచురల్ ఫ్యాన్స్ లో..ఇటు ఆడియాన్స్ అందరిలో ఓ క్యూరియాసిటీ ఏర్పడింది. అంతే కాదు సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.  2023 స్టార్టింగ్ లోనే ఈ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీమ్. మరి ఈమూవీ అయినా కొత్త సంవత్సరం నానీకి హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తానికి ఓ సినిమా సెట్స్ పైకి ఉండగానే కొత్త సంవత్సర కానుకగా మరో సినిమా అప్‌డేట్ అందించి.. అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాడు నాని.

Follow Us:
Download App:
  • android
  • ios