ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన ఒలీవియా మోరిస్ గుర్తుందిగా. ఆమె కూడా నాటు నాటు సాంగ్ లో భాగమే. సాంగ్ చివర్లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ రెచ్చిపోయి డ్యాన్స్ మొదలు పెట్టినప్పుడు ఒలీవియా ఇచ్చే రియాక్షన్ ప్రైస్ లెస్ అని కొద్దిరోజుల క్రితమే రాజమౌళి ప్రశంసించారు.
గత కొన్ని వారాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది.అనేక ప్రశంసలు పొందింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలు దోచుకుంది. అవన్నీ ఒకెత్తయితే ఇది ఒక్కటీ మరో ఎత్తు.. 130 కోట్ల మంది భారతీయులు గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. మన 'నాటు నాటు' పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది.
ఒక ఇండియన్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించడంతో ప్రపంచం నలుమూలల నుంచి రాజమౌళి అండ్ టీంకి ప్రశంసలు దక్కుతున్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, రాహుల్ సిప్లిగంజ్, చంద్రబోస్ ఇలా అందరూ సంతోషంలో మునిగిపోయారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన ఒలీవియా మోరిస్ గుర్తుందిగా. ఆమె కూడా నాటు నాటు సాంగ్ లో భాగమే. సాంగ్ చివర్లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ రెచ్చిపోయి డ్యాన్స్ మొదలు పెట్టినప్పుడు ఒలీవియా ఇచ్చే రియాక్షన్ ప్రైస్ లెస్ అని కొద్దిరోజుల క్రితమే రాజమౌళి ప్రశంసించారు. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేశారు నిజమే.. కానీ ఈ పాటకి ఒలీవియా ప్రజెన్స్ కొత్త కలరింగ్ తెచ్చిపెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు.
సాంగ్ మొత్తం ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అలరించింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచింది అనే న్యూస్ తెలియగానే ఒలీవియా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. బ్యూటిఫుల్ పోస్ట్ తో ఆర్ఆర్ఆర్ మెమొరీస్ గుర్తు చేసుకుంది.
ఈ శుభవార్తతో నిద్ర లేచాను. ప్రస్తుతం నేను చంద్రుడిపై విహరిస్తునట్లు ఉంది. ఉక్రెయిన్ లో కీవ్ నగరం ప్యాలెస్ లో ఈ సాంగ్ షూట్ చేశాం. షూటింగ్ కి 15 రోజుల ముందు తొలిసారి నాటు నాటు పాట విన్నా. ఆ సాంగ్ లోని ఎనెర్జీకి నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇప్పుడు ఇంత సంతోషం, కేరింతల నడుమ మరోసారి ఈ పాట వింటున్నా. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచింది. సంతోషాన్ని నా మాటల్లో వర్ణించలేదు. ఇందులో నన్ను కూడా భాగం చేసిన రాజమౌళికి థాంక్యూ అని ఒలీవియా మోరిస్ పోస్ట్ పెట్టింది.
