పవన్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌లు అన్నీ వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వారికి బూస్ట్ ఇచ్చే వార్త చెప్పారు `ఓజీ` మేకర్స్. కొత్త ఏడాది సందర్భంగా క్రేజీ పోస్ట్ పెట్టారు.

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ నటించే సినిమాలపై పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఎప్పుడు సినిమాలు చేస్తారనే అనుమానం, ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక నిర్మాతల పరిస్థితి కక్కలేక, మింగలేక అనేలా ఉంది. ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలున్నాయి. ఆ రాజకీయ వేడి అప్పుడే స్టార్ట్ అయ్యింది. దీంతో పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాల్సి వస్తుంది. దీని ప్రభావం ఆయన నటించే సినిమాలపై పడింది. 

పవన్‌ నటిస్తున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. ఆయన ఇప్పుడు హరీష్‌ శంకర్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, సుజీత్‌తో `ఓజీ` అలాగే క్రిష్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఈమూడు సినిమాలు ఆగిపోయాయి. ఏకంగా హరీష్‌ శంకర్‌.. పవన్‌ ఇప్పట్లో రాడు అని తెలిసి ఏకంగా మరో సినిమాకి షిఫ్ట్ అయ్యాడు. రవితేజతో సినిమాని ప్రకటించారు. `మిస్టర్‌ బచ్చన్‌` మూవీ చేస్తున్నాడు. ఇక సుజీత్‌ `ఓజీ` కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ సగానికిపైగా షూటింగ్‌ జరిగింది. మరో పదిహేను, 20 రోజుల పవన్‌ డేట్స్ ఇస్తే చాలు షూటింగ్‌ పూర్తవుతుంది. కానీ ఇప్పట్లో ఆయన రాలేకపోవడంతో వాయిదా పడింది. 

అయితే తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఏం జరిగినా తగ్గేదెలే అని వెల్లడించింది. కొత్త ఏడాది సందర్భంగా విషెస్‌ తెలియజేస్తే, `ఆంగ్రీ చితా లాగా కొత్త ఏడాది లోకి జంప్‌ చేద్దామని, గివప్‌ ఇచ్చేది లే అని పేర్కొంది. ఈ ఏడాది `ఓజీ`తోపాటు `సరిపోదా శనివారం` అనే మూవీతో కూడా తాము రాబోతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చాలా పండుగలు సోమవారమే వస్తున్నాయి. ఇంకేం సరిపోతుంది. లాంగ్‌ వీకెండ్‌ని ఎంజాయ్‌ చేద్దామని తెలిపింది. 

Scroll to load tweet…