Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ ని కలిసిన 'ఓజి' డైరెక్టర్, ప్రొడ్యూసర్.. బిగ్ అప్డేట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో పవన్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన చిత్రాల జాబితా మాత్రం చాంతాడంత ఉంది.

OG director and Producer meets Pawan Kalyan dtr
Author
First Published Aug 22, 2024, 8:34 PM IST | Last Updated Aug 22, 2024, 8:34 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో పవన్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన చిత్రాల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజి చిత్రానికి పవన్ ఇంకొన్ని రోజుల డేట్లు ఇస్తే సరిపోతుంది. 

ఓజి తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలని పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు డేట్లు కేటాయించాల్సి ఉంది. 

ముందుగా పవన్ కళ్యాణ్ ఓజి చిత్రాన్ని పూర్తి చేస్తారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఓజి డైరెక్టర్ సుజీత్, నిర్మాత డివివి దానయ్య ఇద్దరూ పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 

ఓజి, అతడి స్వాడ్ మరోసారి మిషన్ లోకి తిరిగి రాబోతున్నారు అంటూ అప్డేట్ ఇచ్చారు. అంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఓజి షూటింగ్ లో పాల్గొంటారు. ఈ చిత్రం ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఓజి చిత్రంపై క్రేజ్ ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios