మలయాళం సినిమాలు కూడా రోజురోజుకి బాక్స్ ఆఫీస్ స్టామినాను పెంచుకుంటూ వస్తున్నాయి. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ లాల్ లాంటి నటుడు మరోసారి మలయాళం మెగాస్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన ప్రయోగాత్మక చిత్రం ఒడియాన్ ఇప్పుడు సౌత్ లో అందరిని ఆకర్షిస్తోంది. 

మొదటి సారి ఒక మలయాళం సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అంతే కాకుండా ఫస్ట్ టైమ్ 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న సినిమాగా ఒడియాన్ నిలవడం విశేషం. మోహన్ లాల్ గత చిత్రాలు కొన్ని 100కోట్ల గ్రాస్ ను అందుకున్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈ రేంజ్ లో ఎన్నడూ జరగలేదు. ఇక మొదటిసారి 100 కోట్ల మార్క్ బిజినెస్ ను చాలా ఈజీగా అందుకోనుందని హెచ్చరిక జారీ చేశారు. 

ఇక తెలుగులో కూడా ఈ సినిమాను 200కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ రేంజ్ లో మలయాళం సినిమా ఎప్పుడు రిలీజ్  కాలేదు. రిలీజైన టీజర్స్ కి మంచి స్పందన వచ్చింది. 14వ తేదీన సినిమాను విడుదల కానుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఒడియాన్ ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.