ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హాలీవుడ్ ను సైతం అట్రాక్ట్ చేసి.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తారక్ క్రేజ్ కు ఇండియాతో పాటు యూఎస్ కూడా ఫిదా అయ్యింది. అక్కడ ఆయన క్రేజ్ ఎంతుందో రీసెంట్ గా మరోసారి బయట పడింది. 

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హాలీవుడ్ ను సైతం అట్రాక్ట్ చేసి.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. తారక్ క్రేజ్ కు ఇండియాతో పాటు యూఎస్ కూడా ఫిదా అయ్యింది. అక్కడ ఆయన క్రేజ్ ఎంతుందో రీసెంట్ గా మరోసారి బయట పడింది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్ కూడా. ఆయన ఏం చేసినా సరే అది ఇండియాలోనే కాకుండా ఫారెన్ లో కూడా సెన్సేషన్ గా మారుతోంది. తారక్ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా.. మన ఆడియన్స్ తో పాటు విదేశాల్లో ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేసేపరిస్థితి వచ్చింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడంతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆస్కార్ ఈవెంట్ తో పాటు ప్రమోషన్ల కోసం యూఎస్ వెళ్లిన తారక్.. అక్కడ తన ఇమేజ్ ను డబుల్ చేసుకున్నాడు. అభిమానులతో కలిసి తెగ సందడి చేశాడు. 

ఇక ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఏకంగా హాలీవుడ్ లోనే మాట్లాడుకోవడం.. అందులోను ఆస్కార్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడుకున్న హీరో.. ఎక్కువగా వినిపించిన పేరు ఎన్టీఆర్ దే అవ్వడం అరుదైనర రికార్డ్. ఇక మరోసారి ఎన్టీఆర్ క్రేజ్ యూఎస్ లో మారుమోగిపోయింది. తారక్ సినిమా రిలీజ్ కాకముందే.. మనోడి పాటకు స్టేడియం స్టేడియమే దద్దరిల్లిపోయింది. కొన్ని సెకన్ల మ్యూజిక్ బిట్ కే అరిచి రచ్చ రచ్చ చేశారు యంగ్ టైగర్ అభిమానలు. 

Scroll to load tweet…

యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ ఎన్టీఆర్ 30 సినిమాలో థీమ్ సాంగ్ ఇప్పుడు యూస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ థీమ్‌ మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన అనిరుధ్‌.. తన అమెరికా మ్యూజికల్ టూర్ లో భాగంగా.. తాజాగా న్యూ జెర్సీలో ఏర్పాటు చేసిన ఓ లైవ్ కాన్సర్ట్ లో ప్లే చేశాడు. అది అలా ప్లే అయ్యిందో లేదో.. స్టేడియం అంతా ఒక్క సారిగా వైబ్రేషన్స్ వచ్చాయి. అరుపులు..కేకలతో తమ సంతోషాన్ని వెల్లడించారు ఆడియన్స్. అంతే కాదు ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ తెగ అరిచారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందతి. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఈసినిమాకు సబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు కొరటాల. దానికోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రఫర్స నుకూడా దించాడు.