Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలూ జాగ్రత్త .. అంటూ ఎన్టీఆర్ వీడియో

వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' 

Ntr Vedio on women security in  Social media
Author
Hyderabad, First Published Oct 9, 2020, 9:15 AM IST

సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయమై తగు సూచనలిచ్చారు యంగ్ టైగర్.  పర్శనల్ ఇన్ఫర్మేషన్ ని సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేయడం ద్వారా అమ్మాయిలు మోసపోతున్న విధానాన్ని  చూపిస్తూ ఓ వీడియో రూపొందించారు హైదరాబాద్‌ నగర పోలీసులు.  అందుకు ఎన్టీఆర్ సహకారం అందించారు. ఆ వీడియో ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

ఈ వీడియోలు సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ యువతి పడుతున్న మానసిక క్షోభను ఇందులో చూపించారు.  అలాగే ఈ వీడియో చివర్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అలాంటి మోసాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతి యువతి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనలిచ్చారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ..''వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios