మెగా హీరో సాయిధరమ్ తేజ్ జవాన్ సినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టిన ఎన్టీఆర్ గతంలో బాలకృష్ణ వందో చిత్రం ప్రమోషన్ లో ఎక్కడా కనిపించని జూనియర్ బాబాయి వద్దు మెగానే ముద్దు అన్నట్లు కనిపిస్తున్న ఎన్టీఆర్ శైలి బాలయ్యతో విబేధాల వల్లే దూరం పెరిగిందంటున్న ఫిలిమ్ నగర్ వర్గాలు

జవాన్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ చాలా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశాడు. జవాన్ చిత్రం ప్రారంభోత్సవానికి నందదమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించి మరీ క్లాప్ కొట్టించాడు. ఎన్టీఆర్ కూడా చాలా ఆనందంగా క్లాప్ కొట్టి తన సపోర్ట్ ఫుల్లుగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ధరమ్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. పిలవగానే వచ్చి తన మూవీ ఓపెనింగ్ షాట్ క్లాప్ కొట్టినందుకు ధరమ్ తేజ్ చాలా సంతోషం వెలిబుచ్చాడు.

ధరమ్ తేజ్ అందరితో కలిసి మెలిసి ఉంటాడు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఈవెంట్ చూస్తే తెలుస్తోంది. మెగాస్టార్ కు... రామ్ చరణ్, సుకుమార్ ల మూవీని అదే ముహూర్తానికి హాజరు కావాల్సి ఉండటంతో ధరమ్ తేజ చిత్ర ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. దీంతో ఎన్టీఆర్ రాక ధరమ్ తేజ్ కు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. ఇక ఎన్టీఆర్ కూడా అంతే ఉత్సాహంగా ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు.

ఇక్కడే ఆశ్యర్యకరంగా అనిపిస్తోందంటున్నారు సినీ ఫాలోవర్స్. రీసెంట్ గా రిలీజైన బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్ లో పెద్దగా పాల్గొనని ఎన్టీఆర్ మెగా హీరో సినిమాకు క్లాప్ కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాలకృష్ణతో జూనియర్ కు దూరం పెరిగిందని చాలా కాలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బాబాయ్ అబ్బాయిలు ఎడమొహం పెడమొహంలానే ఉన్నట్లు కనిపిస్తోంది. బాలయ్య వందో చిత్రం, అందునా ఓ చారిత్రక పురుషుడిపై తెరకెక్కించిన శాతకర్ణి సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ ఎక్కడా పాల్గొనకపోవడం కలెక్షన్ల పైనా ప్రభావం చూపింది.

ఇప్పుడు మెగా హీరో సినిమా కోసం సంతోషంగా వచ్చిన ఎన్టీఆర్ వ్యవహారం చూస్తుంటే.. బాబాయ్ వద్దు... మెగానే ముద్దు అన్నట్టు అనిపిస్తోందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.