రామ్ చరణ్ కు ఎన్టీఆర్ సర్ ప్రైజ్, క్లింకార కోసం ఏం చేశారంటే..?
ఈమధ్య సెలబ్రిటీల మధ్య భహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్య ఇది ఎక్కువగా జరుగుతోంది.

టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య బహుమతిులు ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఈమధ్య ఎక్కువైపోయింది. అందులోను మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య ఇది ఎక్కువగా జరుగుతోంది. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట దీపావళి పండుగ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ అందరిని కూడా ఆహ్వానించి మెగా ఫ్యామిలీలో ఘనంగా దీపావళి సెలబ్రేట్ చేశారు. తన ఇంట్లో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ వేడుకలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరై సందడి చేశారు.
ఈ వేడుకల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సతీసమేతంగా హాజరయ్యారు. అంతే కాదు మెగా ఇంటి స్టార్ కిడ్ రామ్ చరణ్ కుమార్తె కోసం పలువురు స్టార్స్ అందరూ కూడా వివిధ రకాల కానుకలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారట. ఇందులో టాయ్స్ గిఫ్ట్ లో వివిధ రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి ఐదు సంవత్సరాల వరకు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం.
అయితే అందరికంటే ప్రత్యేకంగా.. మెగా ఫ్యామిలీ దిల్ ఖుష్ అయ్యేలా.. చరణ్, ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే తన కుమార్తె కోసం ఎన్టీఆర్ ప్రత్యేక బహుమతులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈబహుమతులు తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి దగ్గరుండి సెలక్ట్ చేసింద. అంతే కాదు ఈ వేడుకకు హాజరైనటువంటి మహేష్ బాబు దంపతులు కూడా క్లిన్ కారా కోసం ఖరీదైన బహుమతులు తీసుకువచ్చారుట.
అందరికన్నా ఎన్టీఆర్ తీసుకువచ్చిన గిఫ్ట్ చాలా స్పెషల్ గా ఉందంటూ ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ దివాళి సెలబ్రేషన్స్ లో భాగంగా హీరోలందరూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ వేడుకలలో పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.