ఎన్టీఆర్‌ లుక్‌ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్‌లో రికార్డ్ సృష్టించింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురంభీమ్‌ లుక్‌ ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతుంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. టాకీ పార్ట్ పూర్తయ్యింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని చిత్ర బృందం ఇటీవల పేర్కొంది. రెండు పాటలను చిత్రీకరించేందుకు మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ లుక్‌ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్‌లో రికార్డ్ సృష్టించింది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని ఎన్టీఆర్‌ నటిస్తున్న కొమురంభీమ్‌ లుక్‌ ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే అది అతి తక్కువ సమయంలో అత్యధికంగా కామెంట్లు పొందిన పోస్టర్‌గా నిలిచింది. 200కే(రెండు లక్షల) కామెంట్లు పొంది రికార్డు సృష్టించింది. తక్కువ టైమ్‌లో ఈ స్థాయిలో ట్విట్టర్‌ కామెంట్లతో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ లుక్‌ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇందులో కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలీవియా మోర్రీస్‌, చరణ్‌ సరసన అలియా భట్‌ నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. దీన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.