ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది యూనిట్‌. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చింది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్నట్టు తెలిపింది. 

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా, అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా ఇది రూపొందుతుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గడంతో వెంటనే షూటింగ్‌ని ప్రారంభించారు. రామ్‌చరణ్‌ సెట్‌లో అడుగుపెట్టారు. సోమవారం సెట్‌లో చరణ్‌ ఫోటోలు బయటకు వచ్చి హల్‌చల్‌ చేశాయి. 

తాజాగా చిత్ర యూనిట్‌ క్రేజీ అప్‌డేట్‌నిచ్చింది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చింది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటున్నట్టు తెలిపింది. రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయిందని, అలాగే రెండు భాషల్లో ఎన్టీఆర్‌,చరణ్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారని వెల్లడించింది. మిగిలిన భాషల్లో డబ్బింగ్‌ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు వెల్లడించింది. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌ పనులు జరుగుతున్నట్టు యూనిట్‌ వెల్లడించింది. ఈ సందర్బంగా చరణ్‌, ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోని పంచుకుంది. ఇది గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. 

Scroll to load tweet…

ఇక రెండు పాటల్లో ఒకటి చరణ్‌, అలియా భట్‌, మరొకటి ఎన్టీఆర్‌, ఒలివీయాలపై ఉండే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో అలియాభట్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా సీత పాత్రలో నటిస్తుంది. అలాగే బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌, తమిళనటుడు సముద్రఖని, అలాగే శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయాలని భావించారు. అదే డేట్‌కి వస్తుందా? ఏదైనా మారుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.