ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని స్టార్ట్ చేయబోతుంది జక్కన్న టీమ్‌. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు. 

ఇండియా వైడ్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. డివివి దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్‌ 13న దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడినప్పటికీ అదే డేట్‌కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. తాజా అప్‌డేట్‌ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. 

ఈ సినిమా ప్రమోషనల్‌ ఫెస్టివల్‌ని స్టార్ట్ చేయబోతున్నారు జక్కన్న టీమ్‌. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్‌ వీడియో గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 15న(జులై 15)న ఉదయం11 గంటలకు విడుదల చేయబోతున్నారు. `రోర్‌ఆఫ్‌ఆర్‌ఆర్‌ఆర్‌` పేరుతో దీన్ని విడుదల చేయబోతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` అరుపులు ఇక ప్రారంభం కాబోతున్నాయనే విషయాన్ని చెబుతుందీ టీమ్‌. దీంతో ఫ్యాన్స్ కి పునకాలు ఖాయమనే చెప్పాలి. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడ్డా షూటింగ్‌ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాకీ పార్ట్ ని పూర్తి చేసుకుని రెండు పాటలను చిత్రీకరించుకోబోతుంది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుంది. 

Scroll to load tweet…

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నటిస్తున్నారు. సముద్రఖని, అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా దాదాపు పూర్తయినట్టు టాక్‌. దాదాపు పది భాషల్లో గ్రాండ్‌గా సినిమాని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రధాన తారాగణం ఫస్ట్ లుక్స్, టీజర్లకి విశేషమైన స్పందన లభించింది.