సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే పరిశ్రమ ప్రముఖులు మహేష్ బాబుకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బర్త్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ మహేష్ ఫ్యాన్స్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, రామ్ చరణ్ తో పాటు పలువురు మహేష్ బాబుకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. 

Scroll to load tweet…

ఎన్టీఆర్ ప్రేమగా అన్నయ్య అంటూ మహేష్ ని సంబోధించగా, వెంకటేష్ చిన్నోడు ఈ ఏడాది సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు.పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేశారు. మరో మెగా హీరో రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ మహేష్ కి ప్రేమతో కూడిన బర్త్ డే విషెస్ తెలియజేశారు. పరిశ్రమలో మహేష్ బాబుకి ఎన్టీఆర్, రామ్ చరణ్ అత్యంత సన్నిహితులు కావడం విశేషం. 

Scroll to load tweet…

సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు మహేష్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియాలో #happybirthdayMaheshbabu ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కాగా ప్రతి మహేష్ బర్త్ డే రోజు ఆయన అప్ కమింగ్ చిత్రాల అప్డేట్స్ విడుదల చేస్తారు. ఈ బర్త్ డేకు మాత్రం ఎలాంటి కొత్త చిత్రాల అప్డేట్స్ ఇవ్వలేదు. 

Scroll to load tweet…

త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ అప్డేట్ రాలేదు. ఇక మహేష్ త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి తో మూవీ చేయనున్నాడు. భారీ పవన్ వరల్డ్ మూవీగా ఈ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా రాలేదు. ఇది కొంచెం నిరాశ పరిచే అంశం. 

ఇక మహేష్ బర్త్ డే పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో ఒక్కడు, పోకిరి స్పెషల్ షోస్ వేశారు. వీటికి అద్భుత రెస్పాన్స్ దక్కింది. కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకున్న ఈ ప్రదర్శనలు కొత్త రికార్డు సెట్ చేశాయి. పోకిరి, ఒక్కడు చిత్రాలు స్పెషల్ షోస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. మహేష్ తలచుకుంటే ఇలాంటి అద్భుతాలు చేసి చూపిస్తామని నిరూపించారు.