తాజాగా జైలవకుశ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్థుతానికి రాజకీయాలకు కాస్త దూరంగానే వుంటున్నాడు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసినా అది చంద్రబాబుకు కలిసిరాలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్,హరికృష్ణల ఫ్యామిలీ వ్యవహార శైలితో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

 

ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టార్ హీరోలు. జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరో సారి అందరికి పరిచయం చూపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సినిమాతో సంబంధం లేకుండా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టే స్టామినా ఉందని జై లవకుశతో నిరూపించుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడుగా ప్రతి ఒక్కరు గుర్తించే స్థాయిలో ఉన్నాడు.

 

ఇక పవన్ కళ్యాణ్ కూడా కేవలం తనకున్న కరిష్మాతో సినిమాలతో సంబంధం లేకుండా నిర్మాతలకి లాభాలు తెచ్చిపెడతాడు. నటుడుగా పవన్ కళ్యాణ్ అంతగా గుర్తింపు తెచ్చుకోకపోయిన ఆయన చరిస్మాతో సౌత్ ఇండియాలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ వున్న వాడిగా నిరూపించుకున్న వ్యక్తి. తన వ్యవహారశైలితో కారణంగా సంపాదించిన గౌరవం ఇది.

పవన్, ఎన్టీఆర్ లకు ఇద్దరికి వెనుక పెద్ద ఫామిలీస్ ఉన్నాయి. అయితే వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో ఈ ఇద్దరి మార్గాలు చాలా దగ్గరగా ఉంటాయి. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి వ్యక్తిగతంగా వారిని వారు తీర్చిదిద్దుకున్నారు . ఆ వ్యక్తిత్వంతో, వారి ఆలోచన, మాటతీరుతో కోట్లలో అభిమానులని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.

 

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చకు వచ్చినప్పుడు అందరు చెప్పే మాట పవన్ కళ్యాణ్, తారక్. ఇద్దరికి భవిష్యత్తులో తెలుగు ప్రజలకి నాయకులుగా ఉండే లక్షణాలు ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తాత నాయకత్వ లక్షణాలని కూడా పునికిపుచ్చుకున్నాడని, అతనికి ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉందని, కచ్చితంగా రేపటి టీడీపీ భవిష్యత్తు ఎన్టీఆర్ తోనే సాధ్యం అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటె ప్రజల భవిష్యత్తు భాగుంటుంది అనేది చాలా మంది మాట. అతనికి కష్టం విలువ తెలుసనీ, ప్రజల సమస్యల మీద స్పందించే గుణం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వినిపిస్తున్న మాట.

ఇక పవన్ కళ్యాణ్ కి అన్న పెట్టిన రాజకీయ పార్టీతో వచ్చిన అపవాదు వెనక ఉన్నా... కొత్త పార్టీతో రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టి తనదైన శైలిలో ప్రజల సమస్యల మీద స్పందిస్తూ రాజకీయాల్లో ముందుకెళ్తున్నాడు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్రభావం చూపించే నాయకుడు అవుతాడని, ప్రజా సమస్యల మీద అతను స్పందించే తీరు,  సమస్యని క్షుణ్ణంగా పరిశోధించి దానిపై మాట్లాడుతూ, ఆ సమస్య మీద అందరు ద్రుష్టి పెట్టేలా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా ఉన్నాడని మాట వినిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పవన్ వ్యక్తిత్వం రాజకీయాలకి కరెక్ట్ గా సరిపోతుందని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని, అతనితో ఎంతో కొంత మార్పుని రాజకీయాల్లో చూడొచ్చని అంటున్నారు.

 

అయితే ఇప్పుడు తెలుగు ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది తెలుగు నాట పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పార్టీల పరంగా కాకున్నా, ఒకే ఆలోచనతో ఉన్న నాయకులు కాబట్టి వారు రాజకీయాల్లో ఉంటే ఏపీ దేశంలో రాజకేయాలని శాశించే రాష్ట్రం అవుతుందని, అలాగే మిగిలిన రాష్ట్రాలకి కూడా ఏపీ ఆదర్శం అవుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు.

 మరోవైపు అన్న టీడీపీ పార్టీని పునరుద్ధరించి.. అనంతరం పవన్ కళ్యాణ్ తో అవగాహ కుదుర్చుకుంటే... భవిష్యత్తు గొప్పగా వుంటుందని ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్న టీడీపీని తిరిగి పునరుద్ధరించి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు తమవైపుకే మళ్లుతాయని హరికృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  రాజకీయ రంగ ప్రవేశం మీద ఆధారపడి ఉంటుంది.