దేశంలోనే బిగ్గెస్ట్ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి ఆదరణ అందుకుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ సెకండ్ సీజన్ కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీంతో సెకండ్ సీజన్ ను ఎలాగైనా ఇంకా సరికొత్తగా చూపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోంది. 

అంతే బానే ఉంది కానీ.. అసలైన యాంకరింగ్ మజా కంటిన్యూ కాదు అనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎందుకంటే షో ఎవరి వల్ల స్ట్రాంగ్ గా అయ్యిందో వారే ఇప్పుడు చేయడానికి సిద్ధంగా లేరట. అదేనండి మన చిచ్చరపిడుగు జూనియర్ ఎన్టీఆర్. మొదటి సారి బుల్లి తెరపై షోని తన ఇమేజ్ తో నడిపించిన తారక్ సెకండ్ సీజన్ కి వ్యాఖ్యాతగా చేయడం డౌటే.. ఎందుకంటే తారక్ ఈ ఏడాదిలో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అది బడా దర్శకుల సినిమాలు కావడం ఒక కారణం. 

త్రివిక్రమ్ సినిమాతో తారక్ ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. మార్చ్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళి చేయబోయే సినిమాకి సిద్ధంగా ఉండాలి. 

ఆ సినిమా షూటింగ్ కి ముందే జక్కన్న వర్క్ షాప్ నిర్వహించనున్నాడు. ఫిట్ నెస్ లో కూడా తారక్ కొన్ని మార్పులు చేయాలి. దానికి తోడు చరణ్ డేట్స్ కూడా మళ్లీ ప్రాబ్లమ్ అవుతుంది. అంతే కాకుండా తన ఫ్యామిలీకి సంబందించిన కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ 2 కి తారక్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదని అధికారికంగా తెలియకపోయినా అర్ధం చేసుకోవచ్చు. మరి షో నిర్వాహకులు తారక్ ప్లేస్ లో ఎవరిని తీసుకువస్తారో చూడాలి.