ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ మహానాయకుడు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి ఏషియన్ మహేష్ బాబు (AMB) మల్టిప్లెక్స్ లో స్టార్ట్ చేశారు. ఈ షో చూడటానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇతర సన్నిహితులు హాజరయ్యారు. 

2 గంటల 8 నిమిషాల నిడివి కలిగిన మహానాయకుడులో మెయిన్ గా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపిస్తున్నారు. మొదట ఎన్టీఆర్ చిన్ననాటి సన్నివేశాలను స్పెషల్ గా ప్రజెంట్ చేశారు. అందులో చంద్రబాబు మనవడు అతిధి పాత్రలో కనిపించడం స్పెషల్ అని చెప్పాలి. నారా దేవాన్ష్ చిన్నప్పటి ఎన్టీఆర్ గా ఇచ్చిన స్పెషల్ అప్పీరియన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.