టాలీవుడ్ లో మొదటిసారి ఒక వెండితెర కథానాయకుడి బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు అనగానే అందరి చూపు ఒక్కసారిగా అటువైపు మళ్లింది. ఎన్టీఆర్ లాంటి మహా నటుడి బయోపిక్ అంటే ఆ సినిమాపై అంచనాలు రిలీజ్ తరువాత ఒక్కసారిగా కనుమరుగైపోయాయి. కథానాయకుడు సినిమా ఊహించని నష్టాలను మిగిల్చడంతో మహా నాయకుడు సినిమాను కొనేందుకు ఎవరు పెద్దగా దైర్యం చేయడంలేదు. 

ఈ స్థాయిలో బాలకృష్ణ సినిమా బిజినెస్ పడిపోవడం అన్నది గత కొంత కాలంగా ఎన్నడు జరగలేదు. బాలకృష్ణ సినిమాకు అంటే కొన్ని ఏరియాల్లో ఎగబడి కొనుక్కునేవారు. అందులోను ఎన్టీఆర్ బయోపిక్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ ఈ సినిమాకు రెస్పాన్స్ రాకపోవడం అనేది ఒక షాక్ లాంటిది. ఫైనల్ గా బాలకృష్ణ బయ్యర్స్ మాట్లాడి వారిని బుజ్జగించి అందరికి సరితూగేలా ఒక రేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. నష్టపోయిన వారికి దాదాపు సెకండ్ పార్ట్ ను తక్కువ ధరకు ఇస్తున్నట్లు టాక్. 

మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చెయ్యాలని బాలకృష్ణ టార్గెట్ గా పెట్టుకున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను ముగించుకొని ప్రమోషన్స్ తో మళ్ళీ సెకండ్ పార్ట్ పై అంచనాలను పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాలకృష్ణ అంటే మినిమమ్ మార్కెట్ ఉన్న హీరో. అలాంటి హీరో సినిమాకు బయ్యర్స్ దొరక్కపోవడం గమనార్హం.