Asianet News TeluguAsianet News Telugu

'యన్.టి.ఆర్. మహానాయకుడు' ఫ్రీగా ఇవ్వరట.. ప్లాన్ మారింది!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'యన్.టి.ఆర్'. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా మొదటి భాగం 'యన్.టి.ఆర్. కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. 

NTR Mahanayakudu business plan disappoints buyers
Author
Hyderabad, First Published Feb 11, 2019, 12:40 PM IST

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'యన్.టి.ఆర్'. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా మొదటి భాగం 'యన్.టి.ఆర్. కథానాయకుడు' సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ద్వారా నష్టపోయిన బయర్లలకు ..మహానాయకుడు చిత్రం ఫ్రీగా ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే యాక్షన్ ప్లాన్ ని మార్చినట్లు తెలుస్తోంది. 

కథానాయకుడు ద్వారా నష్టపోయిన వారికి ఇరవై శాతం నష్టపరిహారం సెటిల్ చేసి ఇచ్చేద్దామని నిర్మాతలు నిర్ణయించుకన్నారట. అంతే కానీ మహానాయకుడుని ఫ్రీగా ఇచ్చే ఆలోచన ను మార్చుకున్నారట. మహానాయకుడుని కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అమ్ముదామని అనుకుంటన్నారట. అయితే కథానాయకుడు ద్వారా నష్టపోయిన వాళ్లు ఎంతవరకూ ఇలా చేయటం సమంజసం అంటున్నారట. 

మరికొందరైతే మహానాయుకుడు చిత్రం కూడా వర్కవుట్ కాకపోతే పూర్తి గా నష్టపోతాం...ఉన్నంతలో సెటిల్ చేసుకోవటం బెస్ట్ అని అంటున్నారుట. ఇలా రకరకాల చర్చలు, వాదాలు, వివాదాలతో మహానటుడు ఆఫీస్ దద్దరిల్లుతోందిని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

ఇక యన్టీఆర్ నటజీవితం నేపథ్యంలో తొలి భాగం 'యన్.టి.ఆర్. కథానాయకుడు' తెరకెక్కగా రాజకీయ జీవిత నేపథ్యంలో రెండో భాగం 'యన్.టి.ఆర్. మహానాయకుడు' రూపొందింది. వాస్తవానికి మలి భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. మరి రెండో భాగమైనా కమర్షియల్‌గా మెప్పిస్తుందేమో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios