ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అర్థ రాత్రి సడన్ ట్రీట్ ప్లాన్ చేశారు కొరటాల శివ టీమ్. ఆసక్తిగొలిపేలా ఎన్టీఆర్ బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ తన 30వ చిత్రం కొరటాల శివతో చేస్తుండగా టీమ్ బెస్ట్ విషెష్ తెలియజేశారు. అయితే బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో ఎన్టీఆర్ జెంటిల్ లుక్ లో అదరగొట్టాడు. తెల్లని చిన్న చారల షర్ట్, జీన్స్ ధరించి, టక్ ఇన్ చేసి క్లాస్ గా కనిపించారు. 


ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకోగా అధికారికంగా కొరటాల మూవీలో ఎన్టీఆర్ లుక్ ఇదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. త్రివిక్రమ్ మూవీ వెనుకకు నెట్టి ఎన్టీఆర్ కొరటాలతో తన 30వ చిత్రం లైన్ లో పెట్టాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఎన్టీఆర్ 30 సైతం భారీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు. 


ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ఈ వార్త హల్ చల్ చేస్తుంది. మరోవైపు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ సైతం కన్ఫర్మ్ కావడం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన బర్త్ డే కానుకగా వెలువడింది. కాగా ఆర్ ఆర్ ఆర్ నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ఎన్టీఆర్ ఫెరోషియస్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు.