ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ టీవీ యాడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ కమర్షియల్ కు సినిమాటోగ్రాఫర్ తిరు  డైరక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో జనతాగ్యారేజ్ సినిమాకు ఎన్టీఆర్ తో కలిసి పనిచేసారు.  ఆ యాడ్ వర్క్ ని ఎన్టీఆర్ స్వయంగా ఆయన్ని పిలిచి అప్పగించినట్లు సమాచారం. తను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ఒట్టో షర్ట్స్ కు సంభందించిన యాడ్ అది.  

మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం తారక్ చేస్తున్న కొత్త యాడ్  ఇది. అందులో ఒట్టో బ్రాండ్ గురించి చెప్పటమే కాకుండా తొడుక్కుని మరీ చూపిస్తాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్ చేసిన యాడ్ ఇది.  సూర్య నటించిన 24 చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా తన టాలెంట్ ని నిరుపించుకున్న తిరు జనతా గ్యారేజ్ చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కు ఈ సినిమాటోగ్రాఫర్ అంటే చాలా ఇష్టం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శక్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎన్టీఆర్ కంటిన్యూ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు.వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రం  ఎన్టీఆర్, రాజ‌మౌళి ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతోంది. ఈ చిత్ర  షెడ్యూల్ బ‌ల్గేరియాలో  రీసెంట్ గా జరిగింది. 

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు జ‌క్క‌న్న‌.  జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ హీరోయిన్ గా న‌టిస్తున్నఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గణ్ వంటి ప్ర‌ముఖులు కూడా భాగం అవుతున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.