Asianet News TeluguAsianet News Telugu

Rowdy Boys Trailer Launch: దిల్ రాజుతో ఎన్టీఆర్ చిట్ చాట్.. నన్ను నేను ముసలోడిని చేసుకున్నట్లు అవుతుంది

టాలీవుడ్ లో దిల్ రాజు బడా నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలలో దిల్ రాజు మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు నేడు నిర్మాతగా టాలీవుడ్ శిఖరాగ్రాన ఉన్నారు.

NTR funny chitchat with Dil raju at Rowdy Boys Trailer Launch
Author
Hyderabad, First Published Jan 8, 2022, 5:17 PM IST

టాలీవుడ్ లో దిల్ రాజు బడా నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలలో దిల్ రాజు మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు నేడు నిర్మాతగా టాలీవుడ్ శిఖరాగ్రాన ఉన్నారు. నడిపించేది అంతా దిల్ రాజే అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే ఆయన మాత్రమే కాదు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా అందులో భాగస్వామే. 

ఇదిలా ఉండగా శిరీష్ కుమారుడు ఆశీష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఈ చిత్రం. ఆశీష్ కి జోడిగా ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ అండదండలు.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి బ్యానర్ బ్రాండ్ వ్యాల్యూ ఉండడంతో రౌడీ బాయ్స్ చిత్రంపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. 

ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో నేడు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ఈ సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ రౌడీ బాయ్స్ ట్రైలర్ చూశారు. ఈ సందర్భంగా రౌడీ బాయ్స్ టీం ఎన్టీఆర్ తో ముచ్చటిస్తున్న వీడియో విడుదల చేశారు. 

ట్రైలర్ చాలా బావుంది అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఈ మూవీలో ప్రేమదేశం వైబ్స్ కనిపిస్తున్నాయి అని ఎన్టీఆర్ అన్నారు. దిల్ రాజు, శిరీష్ లతో నాకు ఆది సినిమా నుంచి అసోసియేషన్ మొదలయింది అని ఎన్టీఆర్ తెలిపారు. అప్పటికి ఆశీష్ చిన్న పిల్లాడు. ఆశీష్ ని చిన్న పిల్లాడు అంటే నన్ను నేను ముసలోడిని చేసుకున్నట్లు అవుతుందేమో అని ఎన్టీఆర్ ఫన్నీగా స్పందించారు. పరిచయం కూడా లేదు నాకు. నేను వారిని రాజన్న, శిరీష్ అన్న అని పిలుస్తుంటా. మా శిరీష్ అన్న కొడుకు ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. 

ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఎన్టీఆర్ తెలిపారు. అందరూ కోవిడ్ రూల్స్ పాటిస్తూనే సినిమాని థియేటర్స్ లోనే చూడాలి. అలా ఇండస్ట్రీకి ప్రేక్షకులంతా సాయం చేయాలి అని ఎన్టీఆర్ కోరారు. తాను కూడా ఈ చిత్ర విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. 

ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న విడుదల కావాల్సింది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ కోవిడ్ కారణంగా వాయిదా పడడంతో చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్దకు క్యూ కట్టాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios