Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు.. దేవర ప్రీ రిలీజ్ రద్దు.. ప్రొడ్యూసర్స్ పొరపాటే నా..?

ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూసిన దేవర ప్రీరిలీజ్ ఈవెంట్.. అదే ఫ్యాన్స్ వల్ల కాన్సిల్ అయ్యింది. ఇందులో ప్రొడ్యూసర్స్ చేసిన పొరపాటు కూడా కనిపిస్తోంది. 

NTR Fans Cause Cancellation of Devara Pre-Release Event: Producer Oversights JMS
Author
First Published Sep 22, 2024, 9:22 PM IST | Last Updated Sep 22, 2024, 9:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‌- జాన్వీ కపూర్ జటగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా  దేవర. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీ ఈనెల 27న రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా  దేవర  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు హైదరాబాద్ లోని నెవాటాల్ లో ఏర్పాటు చేశారు. కాని ఈ ఈవెంట్ ను అన్యూహ్యంగా రద్దు చేసినట్టు టీమ్ ప్రకటించింది. 

ఎన్టీఆర్ దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ ను  భద్రతా పరమైన కారణాలతో రద్దు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. నోవాటాల్ లో భారీ ఎత్తును ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తారక్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే నోవాటాల్ లో 2‌000 మందికి మాత్రమే సరిపోయే స్పేస్ ఉండటంతో.. గందరగోళం ఏర్పడింది. 

పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి రావడం.. హాల్ కెపాసిటీని మించి నిర్మాతలు పాస్ లు జారీ చేయడం.. అంతకు మించి జనాలు రావడం.. లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో.. అభిమానులు హడావిడితో గందరగోళం ఏర్పడింది. అంతే కాదు అభిమానులు అత్యుత్సాహంతో నోవాటాల్ పాక్షికంగా ధ్వసం అయ్యింది. ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుందని నిర్వాహకులు భావించారు. 

దాంతో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో అభిమానులు నిరాశ చెందారు. రెండు రాష్ట్రాలలో ఎక్కడెక్కడినుంచో సిటీకి చేరుకున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యింది. దాంతో ఫాన్స్ ను ఉద్దేశించి పత్రిక ప్రకటన చేయనున్నారు ఎన్టీఆర్. అయితే ఈ విషయంలో నిర్మాతలు,నిర్వాహకులు తప్పు కూడా కనిపిస్తోంది. 

ఎన్టీఆర్ సినిమా రాక దాదాపు మూడేళ్లకు పైనే అయ్యింది. తారక్ సినిమా కోసం తహతహలాడుతున్నారు అభిమానులు.అటువంటిది దేవర లాంటి ప్యాన్ ఇండయా సినిమాకు.. ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే పెద్ద ఎత్తున నిర్వహించాలి. అది కూడా అవుడ్ డోర్ లో నిర్వహించి ఉంటే ఎంత మంది వచ్చినా.. ఇబ్బంది లే కుండా ఉండేది. కేవలం రెండు వేల మంది మాత్రమే పట్టే కెపాసిటీ ఉన్న హాల్ లో..ఎన్టీఆర్ సినిమా ప్రిరిలీజ్ అనేది ఎలా సాధ్యం అవుతుంది. 

తారక్ కోసం వేలల్లో ఫ్యాన్స్ తరలివస్తారు. పాసులు ఉన్నా లేకున్నా.. ఎన్టీఆర్ ను చూడటానికి వేలల్లో అభిమానులు వచ్చారు. దాంతో అక్కడ పరిస్థితి చేదాటి పోయింది. దాంతో ఈవెంట్ రద్దు అయ్యింది. ఇక 27 సినిమా రిలీజ్ ఉంది. ఇంకా 5 రోజులు ఉండటంతో.. మరో ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేస్తారా..? లేకు ప్రెస్ మీట్ తోనే సరిపెడతారా.. అనేది చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios