పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR) కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంత ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు.. మరీ ముఖ్యంగా యూఎస్ఏలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితంలోని అజ్ఞాత కాలాన్ని దర్శకుడు రాజమౌళి కల్పితంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt)తో పాటు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్స్, గ్లిమ్స్ సినిమాపై హద్దుల్లేని అంచనాలను పెంచింది.
మార్చి 25న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ వేయి కండ్ల తో ఎదురుచూస్తున్నారు. టికెట్ బుకింగ్ దగ్గర నుంచే రికార్ట్స్ ను బ్రేక్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇఫ్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కు అన్ని సన్నాహాలు పూర్తి చేయడంతో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అవ్వడమే కాదు రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ అభిమాని ఒకరు ప్రీమియర్ షో కోసం ఏకంగా 75 టికెట్లు దక్కించుకున్నారు.
తాజాగా ఎన్టీఆర్ మరో అభిమాని, భారీగా టికెట్లను కొనుగోలు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. కొనుగోలు టికెట్లను ‘ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్, జై ఎన్టీఆర్’ రూపంలో పేర్చి సెలెబ్రేషన్స్ ను స్టార్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అలాగే కేక్ లు కట్ చేయడం, కారు ర్యాలీలు కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు యూఎస్ఏలోని డల్లాస్, చికాగో, సీటల్, బోస్టన్, కొలంబస్, చార్లోట్, జాక్స్నోవిల్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ వేడుకలను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఇంతకు ముందే ప్రమోషన్లు అన్ని భాషల్లో దాదాపు పూర్తయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ వీడియోస్. సాంగ్స్.. పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
