Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున చేసిన పనికి ఎమోషనల్ అయిన ఎన్టీఆర్, చాలా ఊహించానంటున్న కింగ్...

బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు హాజరయ్యారు కింగ్ నాగార్జున. ఈ మూవీలో నటించిన ఆయన.. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. నాగ్ మాటలకు ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. 

NTR Emotional about Nagarjuna Comments
Author
First Published Sep 2, 2022, 11:31 PM IST

రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్..కొన్ని కారణాలవల్ల కాన్సిల్ అయ్యింది. దాంతో పార్క్ హోటల్ లో స్టర్స్ ప్రస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడారు కింగ్ నాగార్జున. ఈ మూవీలో నటించిన నాగ్  సినిమాకు సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు. ముందుగా ఆయన స్పీచ్ మొదలు పెడుతూ.. తారక్ గురించి మాట్లాడారు. ఈరోజు సెప్టెంబర్ 2. నా అన్న హరికృష్ణ పుట్టిన రోజు అంటూ ఎన్టీఆర్ కు గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడారు. సభాముఖంగా ముందు హరికృష్ణను నాగ్ తలుచుకోవడంతో పాటు.. ఆయనకు విషెష్ తెలుపడంతో.. ఒకింత ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ఆయన కళ్లు చెమ్మగిల్లినట్టు కనిపించాయి. 

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా అద్భుతమైనదన్నారు. నాగ్. ఈ ఈవెంట్ ను రాజమౌళి నడిపిస్తున్నాడంటే.. అందులోనూ.. తారక్ గెస్ట్ అంటే.. చాలా ఊహించాను. కాని ఈవెంట్ ను కాన్సిల్ చేసుకోవల్సి వచ్చిందన్నారు. ఇక డైరెక్టర్ అయాన్ ను చిన్న పిల్లాడితో పోల్చిన నాగ్.. అతను చాలా టాలెంటెడ్ అన్నారు. ఈ ఈవెంట్ లో డైరెక్ట్ లేకపోవడంతో.. ఆయన్ను చాలా మిస్ అవుతున్నామన్నారు నాగ్. ఇక ఆలియా భట్, రణ్ బీర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది.. మోస్ట్ టాలెంటెడ్ కపుల్స్ వాళ్ళు అంటూ ఇద్దరిని పొగడ్తలతో ముంచెత్తారు నాగార్జున. అంతే కాదు త్వరలో వారిద్దరికి అంతకంటే టాలెంటెడ్ కిడ్ రాబోతున్నాడంటూ విష్ చేశారు. 

ఇక ఈ సినిమాలో నేను చేయడం అద్భుతంగా అనిపించిందన్నారు నాగార్జున. తనతో పాటు తన జోడీగా నటించిన మౌనీ రాయ్ ఎనర్జీ లెవల్స్ అద్భుతమంటూ కితాబిచ్చారు. ఇక పనిలో పనిగా.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేస్తున్న నిర్మాత కరణ్ జోహాన్ ను కూడా నాగ్ ఆకాశానికెత్తారు. ఇంలాంటి సినిమాలు చేసే సాహసం కరణ్ చేయడం నిజంగా అద్భుతమన్నారు. అంతే కాదు రాజమౌళితో కలిసి.. ఇంకా మరిన్ని అద్భుతాలు చేయాలన్నారు. ఈ 9న సినిమా మీ అందరిని అలరిస్తుంది అని ఆశిస్తున్నా అన్నారు నాగార్జున. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగం అయినందుకు చాలా సంతోషమన్నారు. 

ఇక  రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో లో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా  సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. హిందీతో పాటు  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios