Asianet News TeluguAsianet News Telugu

#Devara ఓటిటి రిలీజ్ టైమ్, పార్ట్నర్ ఫిక్స్.., అఫీషియల్ ఇన్ఫో

 దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. 

Ntr #Devara  OTT streaming partner and streaming languages is officially out jsp
Author
First Published Jan 15, 2024, 8:35 AM IST

ఎన్టీఆర్ తన బ్లాక్ బస్టర్ ఆర్ .ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర చుట్టూ ఎంత క్రేజ్ నెలకొని ఉందో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకు అదే  స్దాయిలో బిజినెస్ అవుతోంది.  ముఖ్యంగా దేవర ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8న వచ్చిన తర్వాత రెట్టింపు అయ్యాయి  ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన తర్వాత బిజినెస్ ఓపెన్ చేసారు. ఆ గ్లింప్స్ అదిరిపోతాయని, ఎంత రేటు పెట్టైనా ఈ సినిమాని కొనుక్కోవాలనిపించేలా కట్ చేసారు. ఇక ఇప్పుడు బిజినెస్ లో అతి కీలకమైన భాగం మంచి రేటుకు ఓటీటి రైట్స్ అమ్మడం. దేవర ఓటిటి రైట్స్ అమ్మేసామని అఫీషియల్ గా చెప్పారు కళ్యాణ్ రామ్. 

దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని  చెప్పారు. కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఓటిటి రైట్స్ ఇవ్వటం జరిగింది. ఈ రైట్స్ కు ఏకంగా 150 కోట్లు పెట్టి దక్కించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో  షూటింగ్ పూర్తి కాకుండానే ఓన్లీ డిజిటల్ రైట్స్ తోనే పెట్టుబడి సగం వచ్చినట్టు అయ్యింది.ఇది రికార్డ్ రేటు అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా , ఓటిటి స్ట్రీమింగ్ రిలీజ్ అయ్యిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ జరగనుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కావటంతో 8 వారాలు అని లేకపోతే 4 వారాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేదని చెప్తున్నారు. 
 
మరో ప్రక్క దేవర నిర్మాతలు 145 కోట్ల  థ్రియేటర్ బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చే పెద్ద ప్యాన్ ఇండియా చిత్రం కాబట్టి భారీ బడ్జెట్ పెడుతున్నారు.  దాంతో బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ ఆ స్దాయిలోనే ఉంటాయి.  ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కు బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ చూస్తే... ఆంధ్రా నుంచి 65 కోట్లు, సీడెడ్ నుంచి 25 కోట్లు, నైజాం నుంచి 55 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. ఖచ్చితంగా నెగోషియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ గా ఎంతకు బిజినెస్ డీల్స్ సెట్ అవుతాయో చూడాలి.
   
ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios