Asianet News TeluguAsianet News Telugu

సముద్రం నుంచి 'దేవర' సైన్యంతో వస్తున్నాడు.. సాంగ్ ప్రోమో వచ్చేసింది..

దేవర చిత్రం పై ఎన్టీఆర్ అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

NTR Devara movie fear song promo out now dtr
Author
First Published May 17, 2024, 5:35 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక వైపు దేవర, మరోవైపు వార్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు చిత్రాలని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడు. దేవర చిత్రం పై ఎన్టీఆర్ అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన ప్రోమో ఇంకా సినిమాపై అంచనాలు పెంచేసింది. డైరెక్టర్ కొరటాల శివ కరెక్ట్ మీటర్ లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థం అయిపోయింది. 

ఈ చిత్రం ఎక్కువ భాగం సముద్రం నేపథ్యంలోనే ఉంటుంది. కొరటాల చెప్పిన స్టోరీ పాయింట్, టీజర్ లో విజువల్స్ మొత్తం సముద్రం చుట్టూనే అల్లుకుని ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ తాజాగా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫియర్ సాంగ్ అనే పేరుతో ఈ పాటని మే 19న రిలీజ్ చేయనున్నారు. 

 

సాంగ్ ప్రోమోలో విజువల్స్ చూస్తే తారక్ తన సైన్యంతో సముద్రంలో కదలి వస్తున్నట్లు విజువల్స్ ఉన్నాయి. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సాంగ్ ప్రోమోలో వినిపిస్తున్న బీట్ ఎనెర్జిటిక్ గా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios