అరవింద సమేత అదిరిపోయే పోస్టర్ రిలీజ్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 13, Aug 2018, 3:38 PM IST
NTR Aravinda Sametha Veera Raghava Movie Teaser Poster
Highlights

ఈ సినిమా టీజర్ ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. గస్టు 15 ఉదయం 9 గంటలకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నామని ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకి లీకుల బెడద పట్టుకుంది. రెండు సార్లు సినిమాలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు లీకయ్యాయి. ఆ లీకుల ఫోటోలతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నామని ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. 

loader