`ఆర్‌ఆర్‌ఆర్‌` నటుడు రే స్టీవెన్సన్‌ మృతితో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మృతి పట్ల ఎన్టీఆర్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి స్పందించారు. సంతాపం తెలియజేశారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో విలన్‌ పాత్ర(స్కాట్‌ దొర) పోషించిన ఐరీష్ నటుడు రేస్టీవెన్సన్‌ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లోనూ ఆయన మరణం తాలుకూ విషాద ఛాయలు అలుముకున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ విచారం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి స్పందించారు. 

ఎన్టీఆర్‌ తన విచారం వ్యక్తం చేస్తూ, `రే స్టీవెన్సన్‌ మరణ వార్త విని షాక్‌ అయ్యాను. చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవాన్నిచ్చింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబం, ప్రియమైన వారితో ఉన్నాయి. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని వెల్లడించారు. 

Scroll to load tweet…

దర్శక ధీరుడు రాజమౌళి తన సంతాపాన్ని తెలియజేశారు. `షాకింగ్‌గా ఉంది. ఈ వార్తని నమ్మలేకపోతున్నా. రే సెట్స్ లో తనకు ఎనర్జీని, చైతన్యాన్ని తీసుకువచ్చాడు. ఆయనతో పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో నా ప్రార్థనలు ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నారు` అని తెలిపారు. 

Scroll to load tweet…

రేస్టీవెన్సన్‌.. విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నెగటివ్‌ రోల్‌లో వాహ్‌ అనిపించింది. స్టయిలీష్‌ యాక్టింగ్ తో మెప్పించారు. గతేడాది మార్చిలో విడులైన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇది రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. రాజమౌళి రూపొందించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. 

`థోర్` సిరీస్ తో పాపులారిటీనీ దక్కించుకున్నారు, ఇది 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు వచ్చిన `కింగ్ ఆర్థర్`, `ది అదర్ గైస్`, `ది ట్రాన్స్ పోర్టర్,` `యాక్సిడెంట్ మ్యాన్` వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన `క్యాసినో ఇన్‌ ఇస్చీ` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే అనారోగ్యానికి గురై కన్నుమూశారట. దీంతోపాటు `1242ఃగేట్‌ వే టూ దివెస్ట్ `చిత్రంలో నటిస్తున్నారు.