Asianet News TeluguAsianet News Telugu

ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి!


నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 

ntr allu arjun and chiranjeevi casts their votes ksr
Author
First Published May 13, 2024, 8:51 AM IST


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం పార్లమెంట్ అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. టాప్ సెలెబ్స్ ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ సతీ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్... ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఓటు వేయాలని సందేశం ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. తన మిత్రుడు శిల్పా రవికి ఓటు వేయాలని మద్దతు తెలిపాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. 

నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్న అల్లు అర్జున్.. నచ్చిన వ్యక్తులను సపోర్ట్ చేస్తాను అన్నారు. మామయ్య పవన్ కళ్యాణ్, అలాగే పిల్లను ఇచ్చిన మామయ్య చంద్రశేఖర్ రెడ్డిలకు తన సపోర్ట్ ఉంటుందని అన్నారు. అలాగే చిరంజీవి, సతీమణి సురేఖ, కూతురు సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios