ప్రణతి అలా చెప్పగానే నా గుండె ఆగిపోయింది: ఎన్టీఆర్

ntr about her wife pranathi
Highlights

 ప్రణతికి డెలివెరీ టైమ్. ఒకరోజు షూటింగ్ సమయంలో మా ఆవిడతో ఫోన్ మాట్లాడుతున్నాను. నాకు ఏంటో తేడాగా అనిపించింది. నేను ఇక్కడ ఉన్నాను.. నేను వచ్చేవరకు ఆగు.. ఈలోగా బిడ్డను కన్నావో చంపేస్తాను అన్నాను

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అతడికి తన భార్య, బిడ్డలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తారక్ కూడా వారి కుటుంబానికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న తారక్ తన మొదటిబిడ్డ అభయ్ రామ్ పుట్టే సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో తన భార్యను చంపేస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు.

''రభస సినిమా షూటింగ్ కోసం నేను స్విట్జర్లాండ్ వెళ్లాను. అప్పుడు ప్రణతికి డెలివెరీ టైమ్. ఒకరోజు షూటింగ్ సమయంలో మా ఆవిడతో ఫోన్ మాట్లాడుతున్నాను. నాకు ఏంటో తేడాగా అనిపించింది. నేను ఇక్కడ ఉన్నాను.. నేను వచ్చేవరకు ఆగు.. ఈలోగా బిడ్డను కన్నావో చంపేస్తాను అన్నాను. లేదు నాకు బాగానే ఉందని చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే నేను హైదరాబాద్ చేరుకున్నా.. ఇంటికి వెళ్తుంటే మళ్లీ ఫోన్ చేసింది. ఎక్కడున్నవంటే హాస్పిటల్ కు వెళ్తున్నా అని చెప్పింది. నా గుండె ఆగిపోయింది. నేను టెన్షన్ పడుతున్నానని చెకప్ కోసం వెళ్తున్నా అని అబద్దం చెప్పింది.

మా అమ్మ కూడా ప్రణతితోనే ఉంది. సో.. ఏదైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పా.. నేను ఇంటికి వెళ్లి కాఫీ తాగుతున్న సమయంలో మా అమ్మ నుండి నాకు ఫోన్ వచ్చింది. టెన్షన్ తో నా బాడీ మొత్తం చల్లబడిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసి ఎంతసేపట్లో రావాలని అనడిగా.. టైమ్ లేదు.. వీలైనంత తొందరగా వచ్చేయ్ అని చెప్పారు. అప్పుడే మా పెద్దబ్బాయి పుట్టాడు. కొంచెం ఆలస్యమైనా.. నేను ఆ సమయానికి అక్కడ లేకపోయేవాడిని'' అంటూ చెప్పుకొచ్చాడు. 

loader