ఎన్టీఆర్ 30 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారు.   

ఎన్టీఆర్ 30 విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో నిరవధికంగా షూటింగ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్ లో భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. విలన్ రోల్ చేస్తున్న సాయి సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ మీద ఈ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. ఒక ట్రైన్ సెట్ కూడా ఏర్పాటు చేశారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ చివరి దశకు చేరినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో పూర్తి కానుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది. 

దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో జనతా గ్యారేజ్ చిత్రం చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. చాలా కాలం తర్వాత మరోసారి చేతులు కలిపారు. ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. దాదాపు రూ 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కుతుంది. 

అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ సాగరతీరం నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు కొరటాల చెప్పారు. రాక్షసులను భయపెట్టే వీరుడిగా హీరో పాత్ర ఉంటుందని వెల్లడించారు. హీరోయిన్ జాన్వీ పాత్ర కూడా కథలో చాలా కీలకం అన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర విజయం ఎన్టీఆర్ కి చాలా అవసరం. ఆయన నిజమైన పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే ఆచార్య డిజాస్టర్ కావడంతో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ కమ్ బ్యాక్ కావాల్సి ఉంది.