Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ తో కాదు, బన్నీతో బెటర్... ఉప్పెన బుచ్చిబాబు ప్లాన్ మారింది?

దాదాపు రెండేళ్ల సమయం వరకు ఎన్టీఆర్ కోసం వేచి ఉండాల్సిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని కలిశారట బుచ్చిబాబు. ఆయనకు తన వద్ద ఉన్న స్టోరీ లైన్ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించారట.

not ntr uppena buchhibabu trying for allu arjun for his next ksr
Author
Hyderabad, First Published Jun 8, 2021, 10:08 AM IST


ఒక్క హిట్ మూవీ చాలా మంది జీవితాలు మార్చేస్తుంది. ఓ సెన్సేషనల్ విజయంతో సామాన్యులు స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. యువ దర్శకుడు బుచ్చిబాబు కూడా ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. బుచ్చిబాబులో విషయం ఉందని గ్రహించిన నిర్మాతలు ఆయనతో మూవీ చేయడానికి ఎగబడుతున్నారు. టాలీవుడ్ మెగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 


సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబుకు ఎన్టీఆర్ తో కూడా మంచి పరిచయం ఉంది. దీనితో ఎన్టీఆర్ తో మూవీ ఓకె చేయించాలని బుచ్చిబాబు గట్టి ప్రయత్నాలు చేశాడు. ఎన్టీఆర్ కి బుచ్చిబాబు ఓ స్పోర్ట్స్ డ్రామా వినిపించినట్లు సమాచారం. కథ పట్ల ఎన్టీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ తో పాటు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ మూవీలలో నటించాలి. 


దాదాపు రెండేళ్ల సమయం వరకు ఎన్టీఆర్ కోసం వేచి ఉండాల్సిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని కలిశారట బుచ్చిబాబు. ఆయనకు తన వద్ద ఉన్న స్టోరీ లైన్ వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించారట. ఇక పుష్ప మూవీ తరువాత బోయపాటి శ్రీను, వేణు శ్రీరామ్.. బన్నీతో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా బుచ్చిబాబు పేరు వచ్చి చేరగా, బన్నీ ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios