Covid: బాహుబలి భామకు కరోనా, నమ్రత సోదరికి కూడా.. సెలెబ్రిటీలలో అల్లుకుపోతున్న కోవిడ్..

మరోసారి కరోనా తన పంజా విసరడం మొదలెట్టినట్లే కనిపిస్తోంది. దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. వైద్య శాఖ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా పెరుగుతోంది.

Nora Fatehi effected with Corona virus

మరోసారి కరోనా తన పంజా విసరడం మొదలెట్టినట్లే కనిపిస్తోంది. దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. వైద్య శాఖ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని అలెర్ట్ చేసింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కరోనా కరోసారి కలకలం సృష్టిస్తోంది. 

గతంలో కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా కోవిడ్ రెండవసారి సోకుతోంది. అందుకు ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్. గత ఏడాది అర్జున్ కపూర్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఆయన కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఐటెం బ్యూటీ నోరా ఫతేహికి కరోనా పాజిటివ్ గా తేలింది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. తనకు కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు స్వయంగా నోరా ఫతేహి తెలిపింది. 

దీనితో నోరా ఫతేహి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'హే గయ్స్.. అనుకోకుండా నేను కరోనా బారిన పడ్డాను. కరోనా నన్ను చాలా హార్డ్ గా తాకింది. కొన్ని రోజులగా బెడ్ పై నుంచి లేవలేదు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నేను కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఆరోగ్యం కన్నా ఏదీ ఎక్కువ కాదు' అని నోరా ఫతేహి పోస్ట్ పెట్టింది. నోరా ఫతేహి బాహుబలి చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. అలాగే టెంపర్ , కిక్ 2, లోఫర్ చిత్రాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. 

Nora Fatehi effected with Corona virus

ఇదిలా ఉండగా మరో బాలీవుడ్ సెలెబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతకి శిల్పా శిరోద్కర్ సోదరి. శిల్పా శిరోద్కర్ కూడా కోవిడ్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

ముంబైలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ముంబై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారి గృహాలని సీజ్ చేయడం, శానిటైజ్ చేయడం చేస్తున్నారు. అర్జున్ కపూర్ ఇంటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: బ్రాలో అందాలన్నీ ఆరబోస్తున్న క్రేజీ హీరోయిన్.. లేలేత పరువాలతో రచ్చ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios