నోయల్ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయన్ని హారిక అన్నయ్య వంశీ, ఫ్రెండ్ అయిన యాంకర్ నిఖిల్.. ఎట్టకేలకు నోయల్‌ని కలిశారు. ఈ సందర్భంగా నోయల్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ నోయల్ బిగ్‌బాస్‌పై షాకింగ్ కామెంట్ చేశారు. దాని వల్ల ఉపయోగం లేదని, అసలు చూడటమే మానేశానని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్యాప్ సింగర్ నోయల్ ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే ఆయన అనారోగ్యంతో మధ్యలోనే షో నుంచి నిష్క్రమించారు. పోతూ పోతూ అమ్మా రాజశేఖర్, అవినాష్‌లపై విరుచుకుపడ్డారు. వారిద్దరిపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగించి వెళ్లాడు.
ప్రస్తుతం నగరానికి దూరంగా తన ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు నోయల్. బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన వారంతా ఇంటర్వ్యూలిస్తూ హంగామా చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్స్ లో, సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఇంటర్వ్యూలే హల్‌చల్ చేస్తున్నాయి. కానీ నోయల్ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయన్ని హారిక అన్నయ్య వంశీ, ఫ్రెండ్ అయిన యాంకర్ నిఖిల్.. ఎట్టకేలకు నోయల్‌ని కలిశారు. ఈ సందర్భంగా నోయల్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు.
'మనుషులను ఎంత ఇష్టపడితే అంత దూరంగా ఉండాలి. వాళ్ళకు ఎంత దగ్గరగా ఉంటే అన్ని సమస్యలు వస్తుంటాయి. అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా` అని తెలిపాడు. ఈ సందర్భంగా తన అసహనాన్ని, అహిష్టతను వ్యక్తం చేశాడు నోయల్. బిగ్‌బాస్ మనకు అవసరం లేని షో అని, దానిలోకి ఎందుకు వెళ్లానో ఏమో అనిపించిందని, ఇప్పుడు షో చూడటమే మానేశానని తెలిపారు. హౌజ్‌లో ఉన్న వాళ్ళంతా మంచి వారే అని, తన సపోర్ట్ అభిజిత్, హారికలకు అందిస్తానని చెప్పాడు.
హారిక గొప్పతనాన్ని ప్రశంసించాడు. తాను ఒంటరిగా గేమ్ ఆడుతుందని, ఆమెకి లవ్ ట్రాక్‌లు, కామెడీ ట్రాకులు లేవని సొంతంగా కష్టపడి టాప్ సెవెన్‌లో ఉందన్నారు. కెప్టెన్సీ కోసం ఎనిమిది సార్లు పోటీ పడి చివరికి నెగ్గిందని, అది మామూలు విషయం కాదన్నారు. ఆమె మనుషుల్ని వాడుకుని టైటిల్ విన్నర్‌గా నిలవాలన్నాడు. ఇతరులు ఏమైపోతే నాకేంటి? అనుకునే రకం కాదు, తాను గెలవాలని అడుతుందని చెప్పారు. ఈ సారి బిగ్‌బాస్ విన్నర్‌గా అమ్మాయి నిలుస్తే సంతోషిస్తానని, అమ్మాయిని గెలిపించాలని నోయల్ కోరుకున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 4, 2020, 2:20 PM IST