సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆర్జీవీ మిస్సింగ్''. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో రానుంది. ఈ చిత్రంలో వర్మ స్వయంగా నటిస్తున్నారు.  ఈ సినిమాపై వర్మ చాలా ఆశలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగా సినిమా పబ్లిసిటీ విషయంలో విభిన్నంగా గా ఆలోచించే వర్మ.. ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు. రోజుకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడిని పోలిన వ్యక్తులను అక్యూజ్డ్ నెం. 3 మరియు 4 అంటూ పరిచయం చేశాడు. తండ్రికి తనయుడు దండం పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో టీవీలో 'ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు' అని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా చూపించాడు.  

అయితే ఆ పబ్లిసిటీ ఏమీ వర్కవుట్ కావటం లేదు. జనం ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా గురించి బజ్ కొంచెము కూడా లేదు. వరసపెట్టి ఆయన తీస్తున్న సినిమాలు డిజాస్టర్స్ అవటంతో జనం లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాని థియోటర్ లో రిలీజ్ చేద్దామంటే ఎవరూ ఆసక్తి చూపటం లేదట. తన సొంత ఓటీటిలో వేద్దామన్నా...పే  ఫర్ వ్యూకు ఎవరూ ఇష్టపడి చూడరని,పెట్టుబడి పెట్టింది తక్కువే అయినా అది కూడా వెనక్కి రాబట్టడం కష్టమే అని భావిస్తున్నాడట. 

ఇప్పటికే మూడు పోస్టర్స్ విడుదల చేసిన ఆర్జీవీ.. మొదటి దాంట్లో వర్మ చేతులకు బేడీలు వేసుకొని కనిపించాడు. ఆ తర్వాత పవర్ ఫుల్ స్టార్ పీకే అంటూ పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని మొదటి నిందితుడిగా పరిచయం చేశాడు. అలానే థర్డ్ పోస్టర్ లో రెండో నిందితుడిగా ఒమేగా స్టార్ ని చూపించాడు. ఈ క్రమంలో ఆర్జీవీ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసాడు.