Asianet News TeluguAsianet News Telugu

షాక్ :ధనుష్ సినిమాని కొనేవాళ్లే లేరా? కారణం

 ధనుష్ కు మార్కెట్ ఉందంటూ ఎక్కువ రేట్లు చెప్తున్నారట. ఈ క్రమంలో గతంలో సంక్రాంతికి వచ్చిన అజిత్ సినిమానే ఎవరూ పట్టించుకోలేదు

No Takers for Dhanush Captain Miller in AP, Telangana? jsp
Author
First Published Dec 4, 2023, 11:40 AM IST

ఈ సంవత్సరం మొదట్లో  ‘సార్’ అని క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్.. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియడ్ యాక్షన్ డ్రామాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే  భారీ అంచనాలున్నాయి. అరుణ్ మాథేశ్వరన్ దర్శతక్వం వహిస్తున్న ఈ చిత్రం.. ధనుష్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగే తిరుగుబాటు కథతో ఈ సినిమా రూపొందుతోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించటం ప్లస్ పాయింట్ అవుతోంది. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బిజినెస్ తెలుగు నుంచి బాగా ఎక్సపెక్ట్ చేసారు. కానీ ఇక్కడ ఎవరూ కొనేవాళ్లు లేరని ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతోంది.

అందుకు కారణం ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వటమే అంటున్నారు. సంక్రాంతికి తమిళ డబ్బింగ్ సినిమాలు కన్నా తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందనేది నిజం. ఓ ప్రక్కన మహేష్ గుంటూరు కారం, రవితేజ ఈగల్, హనుమాన్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి క్యూలో ఉన్నాయి. దాతో వీటి మధ్యలో ఓ తమిళ డబ్బింగ్ వైపు ఎవరు చూస్తారు అనేది బయ్యర్ల సందేహం. అందులోనూ ఇక్కడ ధనుష్ కు మార్కెట్ ఉందంటూ ఎక్కువ రేట్లు చెప్తున్నారట. ఈ క్రమంలో గతంలో సంక్రాంతికి వచ్చిన అజిత్ సినిమానే ఎవరూ పట్టించుకోలేదు.అలాంటప్పుడు ధనుష్ సినిమా అదీ తమిళ ప్లేవర్ తో సాగే పీరియడ్ సినిమాని ఎవరు చూస్తారనే అంశం వారిని వెనక్కి లాగుతోందిట. అందులోనూ సార్ సినిమాని టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించటంతో వాళ్లు చేసే ప్రమోషన్స్ ఓ డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేసేటప్పుడు ఏమాత్రం ఉండవని అంటన్నారుట.

టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. 1930-40 బ్యాక్ డ్రాఫ్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.
  
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీ మూడు పార్టులుగా ఉండబోతున్నట్టు వార్తలు తెరపైకి రాగా.. మేకర్స్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ (Shivarajkumar) మరో కీ రోల్‌ పోషిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios